Cotton University Recruitment 2025 : కేవలం డిగ్రీ అర్హతతోనే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఇది విన్నారా! కేవలం డిగ్రీ అర్హతతోనే మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి Cotton University నుండి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మీ దగ్గర ఏ విభాగంలో అయినా డిగ్రీ అనే అర్హత ఉంటే కచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అనుభవం అవసరం లేదు. ఈ Cotton University Recruitment 2025 ఆర్టికల్ ద్వారా మీకు అర్థమయ్యే విధంగా తెలుగులోనే వివరాలు తెలపడం జరిగింది… పూర్తిగా చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.
Cotton University Recruitment 2025
Cotton University Recruitment 2025 పూర్తి వివరాలు
ఈ నోటిఫికేషన్ లో మొత్తం తొమ్మిది Junior Assistant ఉద్యోగాలకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు.. ఈ తొమ్మిది ఉద్యోగాలను క్యాటగిరీ వారిగా ఈ విధంగా కేటాయించడం జరిగింది 👇👇
- UR – 05
- OBC – 02
- ST – 02
అర్హతలు ఏముండాలి?
- ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మన దగ్గర తప్పకుండా ప్రభుత్వ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన సర్టిఫికెట్ ఉండాలి. అది ఏ విభాగంలో పాస్ అయినా సరిపోతుంది.
- అయితే ఈ ఉద్యోగాలకు ఏదైనా ప్రభుత్వ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంటే వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
- అనుభవం అనేది తప్పనిసరి కాదు, ఉంటే.. మంచిది లేకపోతే ఏమి ఇబ్బంది లేదు.
- అయితే తప్పకుండా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు వివరాలు 👇 👇
| ఉద్యోగం పేరు | వయస్సు |
| జూనియర్ అసిస్టెంట్ | 18 నుండి 25 (అంచనా) |
Also Read 👉 ఆర్టీసీ లో పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది: ఇప్పుడే అప్లికేషన్ పెట్టేయండి
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఫీజు ఎంత?
- జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు : ₹1000/-
- మిగతా అందరికీ : ₹500/-
Note: ఈ ఫీజు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే పే చేయాలి.
మిగతా విషయాలు:
- ఈ ఉద్యోగంలో చేరితే జీతం నెలకు : ₹50000/- (అన్ని అలవెన్స్ కలుపుకొని).
- సెలెక్షన్ ప్రాసెస్: గౌహతి లో జరుగుతుంది.
- పోస్టింగ్ : గౌహతి లోనే ఉంటుంది..కానీ మన రాష్ట్రాలకు ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. కానీ నోటిఫికేషన్ లో సిలబస్ ఇవ్వలేదు…మీరు కింద ఇచ్చిన టాపిక్స్ ను బాగా ప్రిపేర్ అవ్వండి 👇 👇
- జనరల్ ఇంగ్లీష్
- బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్
- జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్
- రీజనింగ్ ఎబిలిటీ
ఎలా అప్లై చేయాలి?
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి.. ఆ తర్వాత ప్రింట్ అవుట్ పోస్ట్ ద్వారా పంపియ్యాలి. కింద ఇచ్చిన లింక్స్ యూస్ చేసి అప్లికేషన్ చేసుకోండి 👇👇
ముఖ్యమైన తేదీలు :
- స్టార్టింగ్ తేదీ : 20/12/2025
- క్లోజింగ్ తేదీ : 02/01/2026
- హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ : 09/01/2026
హార్డ్ కాపీ పంపాల్సిన అడ్రస్ :
The Registrar, Cotton University, Administrative Building, Cotton University,Panbazar, Guwahati-781001, Assam.