Forest Department Recruitment 2025 : డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

Telegram Channel Join Now

Forest Department Recruitment 2025 : డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

అటవీ శాఖలో ఉద్యోగం చేయాలి అంటే ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు మనకు Forest Department Recruitment 2025 పేరుతో అటవీ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు, ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇంకా కన్సల్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.. ఈ ఆర్టికల్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి, అర్హతలు, ఎంపిక విధానం & దరఖాస్తు ఎలా చేయాలి? మొత్తం వివరించాము.. ఆసక్తి ఉన్నవాళ్లు ఆర్టికల్ మొత్తం చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

Forest Department Recruitment 2025

Forest Department Recruitment 2025 పోస్టుల సంఖ్య

ఈ నోటిఫికేషన్ లో రెండు రకాల పోస్టులు ఉన్నాయి అలాగే రెండు మాత్రమే పోస్ట్ ఉన్నాయి.. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టడానికి ఇదొక మంచి అవకాశం, కింద మీకు పోస్ట్  సంఖ్య జీతం వివరాలు ఇవ్వడం జరిగింది

డేటా ఎంట్రీ ఆపరేటర్ (1 పోస్టు)  ₹25,000/- జీతం
కన్సల్టెంట్ (1 పోస్టు)  ₹40,000/- జీతం

గమనిక : ఇవి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 3 సంవత్సరాలకు భర్తీ చేస్తున్నారు అవసరమైతే ఇంకొక రెండేళ్లు పొడిగిస్తారు.

వయస్సు ఎంత ఉండాలి?

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 28 ఏళ్లకు మించకూడదు
  • కన్సల్టెంట్ – 40 ఏళ్లకు మించకూడదు

NOTE : ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC , ST క్యాటగిరీలకి వయస్సు సడలింపులు కూడా వర్తిస్తాయి

JOIN OUR TELEGRAM CHANNEL

ఉద్యోగానికి కావలసిన అర్హతలు

డేటా ఎంట్రీ ఆపరేటర్ : డిగ్రీ / డిప్లమో ( BCA లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగంలో)

కన్సల్టెంట్ : M.SC ఫారెస్ట్ అలాగే 3 నుండి 5 సంవత్సరాలు వరకు అనుభవం ఉండాలి.

ఇది చదవండి 👉 రైల్వే లో కేవలం 10వ తరగతి తోనే పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల : అప్లై చేయండి

Forest Department Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపిక చేసే విధానం

ఈ ఉద్యోగాలు ఎంపిక చేయడానికి ఎటువంటి రాత పరీక్ష పెట్టడం లేదు.. వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా షార్ట్ లిస్టు చేసి అర్హులైన వాళ్లకు మెయిల్ ద్వారా ఇంటిమేషన్ చేస్తారు వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్లి అటెండ్ అవ్వాలి..రాను,పోను దారి ఖర్చులు కూడా ఇస్తారు.

ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • అప్లికేషన్ ఫారం ప్రింట్ ఔట్
  • మీ సర్టిఫికెట్ల జిరాక్స్ ( 1 సెట్) మరియు ఒరిజినల్స్
  • మీ పాస్ పోర్ట్ సైజ్ ఒక 3 పోటోలు
  • ఇంకా అవసరమైన ఇతర సర్టిఫికేట్లు

దరఖాస్తు చేసే విధానం

ఈ Forest Department Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు ఆఫ్లైన్ విధానంలో చేయాలి.. అప్లికేషన్ ఫారం ను అధికారిక వెబ్సైట్ moef.gov.in నుండి లేదా ఇక్కడ ఇచ్చిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి ” గ్రౌండ్ ఫ్లోర్, ఈస్ట్ వింగ్, న్యూ సెక్రటేరియట్ బిల్డింగ్, సివిల్ లైన్స్, నాగ్‌పూర్ – 440001 లేదా ఇమెయిల్ ద్వారా [email protected] ” కు పంపాలి.

అధికారిక నోటిఫికేషన్ ఇమేజ్ ( ఫుల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు)
అప్లికేషన్ ఫారం

గమనిక : జూలై 7వ తేదీలోపు అప్లికేషన్ సెండ్ చేసేయాలి.

Leave a Comment