GRSE Journeyman Recruitment 2025 : 52 పోస్టులు 10+NAC అర్హత ఉంటే చాలు

Telegram Channel Join Now

GRSE Journeyman Recruitment 2025 : 52 పోస్టులు 10+NAC అర్హత ఉంటే చాలు

GRSE తెలుసు కదా? అదేనండి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజినీర్స్ లిమిటెడ్ లో మనకు 52 జర్నీమెన్ ఉద్యోగాలకు అధికారిక నోటిఫికేషన్ వచ్చింది. ఈ GRSE Journeyman Recruitment 2025 ఆర్టికల్ లో ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే..అర్హతలు,ఖాళీలు,వయస్సు, దరఖాస్తు ఫీజు, ఎంపిక ఎలా? మరియు అప్లికేషన్ చేసే విధానం మొదలగు అంశాలను అందరికీ అర్థమయ్యేలా తెలుగులో వివరించాము..చదివి తప్పకుండా దరఖాస్తు చేసుకోండి.

GRSE Journeyman Recruitment 2025

GRSE Journeyman Recruitmentలో విడుదలైన ఖాళీలు & అర్హతలు

ఖాళీల ఎన్ని?

కింద ఇచ్చిన ఇమేజ్ లో GRSE Journeyman Recruitment 2025 లో విడుదలైన ఖాళీల సంఖ్య, కేటగిరీల వారీగా పోస్టుల సంఖ్య & అర్హతలు ఉన్నాయి.. గమనించండి:

GRSE Journeyman Recruitment 2025

GRSE Journeyman Recruitment 2025

JOIN OUR TELEGRAM CHANNEL

వయస్సు & జీతం వివరాలు

ఈ ఉద్యోగాలకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నుండి 26 సంవత్సరాల వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

ప్రభుత్వ నిబంధన ప్రకారం SC,STలకు: 5ఏళ్ళు, OBC అభ్యర్థులకి 3 ఏళ్ళు వయస్సులో రిలాక్సేషన్ వర్తిస్తుంది.

జీతం :

ఈ GRSE Journeyman Recruitment 2025 ఉద్యోగాలకు మనం ఎంపిక అయితే మొదట 02సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు.

  • మొదటి సంవత్సరం: ₹24,000/-
  • రెండవ సంవత్సరం: ₹26,000/-

ఈ రెండేళ్లు విజయవంతంగా కంప్లీట్ చేసిన వాళ్లకు పర్మనెంట్ గా రిక్రూట్ చేసుకుంటారు, అప్పుడు జీతం : ₹19,900/- రూపాయలు బేసిక్ పే తో స్టార్ట్ అవుతుంది..కానీ మనకు అన్ని అలవెన్సులు కలిపి ₹35,000/- వస్తుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఆన్లైన్ లో అప్లై చేయాలి:

  • దరఖాస్తు స్టార్ట్: 05/07/2025

  • చివరి తేదీ: 04/08/2025

  • హార్డ్ కాపీ పంపాల్సిన చివరి తేదీ: ఆన్లైన్ లో దరఖాస్తు చేసిన ఫారం ను ప్రింట్ ఔట్ తీసి..దానికి మీ సర్టిఫికెట్లను జత చేసి 11/08/2025 తేదీ కల్లా ” Post Box No: 3076, Lodhi Road, New Delhi – 110003″ అనే అడ్రస్ కు ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపియ్యాలి.

ఇది చదవండి 👉 వార్డెన్ ఉద్యోగాలకు అత్యంత భారీ నోటిఫికేషన్: ఇంటర్ పాసైతే చాలు 

ఈ ఫీజు కట్టాలి👇👇

  • అభ్యర్ధులు ₹472/- రూపాయలు ఫీజు ఆన్లైన్ పేమెంట్ చేయాలి, అయితే (SC,ST,PwBD వాళ్ళకు లేదు).

ఎంపిక ఇలా చేస్తారు 👇👇

  • చూడండి కలకత్తా & రాంచీ నగరాలలో OMR టైప్ (అంటే 🖋️ పెన్ & 📜 పేపర్ పద్దతి) లో పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.. ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కింద ఇమేజ్ లో ఇచ్చాను చూడండి:

GRSE Journeyman Recruitment 2025

  • ఆ తర్వాత వచ్చిన మెరిట్ ఆధారంగా ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు.

  • Crane Operator, Rigger, Driver ఉద్యోగాలకు మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు.

👉అధికారిక నోటిఫికేషన్

👉అప్లై చేసే లింక్

మీకు ఈ ఆర్టికల్ ఉపయోగపడితే..తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయండి 🤝

Leave a Comment