NEET UG 2025 Final Result OUT : స్కోర్ కార్డు, కట్ ఆఫ్, కౌన్సిలింగ్ వివరాలు

Telegram Channel Join Now

NEET UG 2025 Final Result OUT : స్కోర్ కార్డు, కట్ ఆఫ్, కౌన్సిలింగ్ వివరాలు

NEET UG 2025 ఫలితాలు జూన్ 14, 2025న విడుదలయ్యాయి, దేశవ్యాప్తంగా మే 4, 2025 లో నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 22.7 లక్షల మంది పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యొక్క అధికారిక వెబ్సైట్ లో స్కోర్ కార్డు, మెరిట్ లిస్టు, కట్ ఆఫ్ మార్కులను విడుదల చేసింది. ఈ బ్లాక్ ఆర్టికల్ లో NEET UG 2025 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కి ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ గురించి పూర్తిగా వివరించడం జరిగింది చదివి తెలుసుకోండి.

NEET UG 2025

NEET UG 2025 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

NEET ఫలితాలను చెక్ చేసుకోవడానికి కింద ఇచ్చిన స్టెప్స్ ను ఫాలో అవ్వండి:
  • అధికారిక వెబ్సైట్ neet.nic.nta.in ను ఓపెన్ చేయండి
  • NEET UG 2025 Result పైన క్లిక్ చేయండి
  • మీ దగ్గర ఉన్న అప్లికేషన్ నెంబర్, సెక్యూరిటీ పిన్, డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేయండి
  • ఇప్పుడు స్కోర్ కార్డు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి
JOIN OUR TELEGRAM CHANNEL 

NEET UG 2025 కట్ ఆఫ్ మార్కులు

నీట్ 2025 కట్ ఆఫ్ మార్కులు కేటగిరీల వారీగా విడుదల చేయబడతాయి. గత 2024 సంవత్సరంలో జనరల్ కేటగిరి కట్ ఆఫ్ మార్కులు 162/720 గా ఉండగా..OBC/SC,ST క్యాటగిరీలకి 127-161 మధ్యలో ఉన్నాయి. ఈ సంవత్సరం కట్ ఆఫ్ మార్కులు స్వల్పంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది, కానీ ఖచ్చితమైన కట్ ఆఫ్ వివరాలు కోసం వెబ్సైట్ ను వీక్షించండి.

ఫైనల్ ఆన్సర్ కి

NTA జూన్ 3వ తేదీన ప్రొవిజినల్ ఆన్సర్ కి విడుదల చేసి, జూన్ 5వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఫైనల్ ఆన్సర్ కిని జూన్ 14వ తేదీన అంటే ఈ రోజున విడుదల చేసింది.. దీన్ని మీరు neet.nic.nta.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీని ఆధారంగానే ఫలితాలు లెక్కించబడ్డాయి.

ఇది చదవండి 👉 రైల్వే లో అద్దిరిపోయే నోటిఫికేషన్: 10th పాసైతే చాలు 

NEET UG 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ

నీట్ 2025 పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) 15% ఆల్ ఇండియా కోటా సీట్లకు కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తుంది, మిగతా 85% కోటా సీట్లకు రాష్ట్రాలు సొంతంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తాయి. కౌన్సిలింగ్ షెడ్యూలు త్వరలోనే mcc.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.

ఈ కౌన్సిలింగ్ ప్రక్రియకు కావలసిన డాక్యుమెంట్స్:
  • నీట్ 2025 స్కోర్ కార్డ్
  • 10th ఇంకా ఇంటర్ మార్క్ షీట్స్
  • క్యాస్ట్/ క్యాటగిరి యొక్క సర్టిఫికెట్ (అవసరమైతే )
  • ఐడి ప్రూఫ్ (ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొదలైనవి )
  • డోమి సైల్ సర్టిఫికేట్

NEET UG 2025 ముఖ్యమైన లింక్స్

👉అధికారిక వెబ్సైట్

👉ఫైనల్ కీ pdf : డౌన్లోడ్ చేయండి

చివరగా

NEET UG 2025 ఫలితాలు వైద్య విద్యలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మీ స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకుని, కటాఫ్ ని కూడా చెక్ చేసుకుని కౌన్సిలింగ్ ప్రక్రియకు సిద్ధంగా ఉండండి..ఆల్ ద బెస్ట్!

Leave a Comment