OFJ Recruitment 2025 : లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక అస్సలు వదులుకోవద్దు!
OFJ Recruitment 2025 పూర్తి వివరాలు: చూడండి ఫ్రెండ్స్! రాత పరీక్ష లేకుండా, ఫీజు కూడా లేకుండా ఒక గవర్నమెంటు ఉద్యోగం సంపాదించాలి అనుకునే అభ్యర్థులకు సువర్ణ అవకాశం! ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జబల్పూర్ (OFJ) లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం అద్భుతమైన నోటిఫికేషన్ ను విడుదల చేసింది, వీటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ కూడా అర్హులే.. వీటి అర్హతలు ఏంటి? ఎలా సెలెక్షన్ చేస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి? మొదలైన విషయాలన్నింటి గురించి ఈ OFJ Recruitment 2025 ఆర్టికల్లో క్లియర్ గా రాయడం జరిగింది పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి.
ఇది ఒకసారి చూడండి 👇👇
ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ లో పోస్ట్ పేరు, దాని యొక్క జీతం, వయస్సు ఏంటి? అన్ని అర్థమయిపోతాయి.
మిగతా విషయాలు ( ఇవి చాలా ఇంపార్టెంట్ 🙋)
1) ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు మొదట రెండు (2) సంవత్సరాలకు తీసుకుంటున్నారు, ఆ తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి పొడిగిస్తూ ఉంటారు.
నా సలహా: కాంట్రాక్టు పోస్టు అయినా.. అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంస్థ ఒక్కసారి ఇరుక్కుంటే మన లైఫ్ సెట్ అయిపోతుంది..
2) జాబ్ లో గాని సెలెక్ట్ అయితే మనకు అకామిడేషన్ (వసతి) కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు.
3) జాబ్ రాగానే మనకు మొదట పోస్టింగ్ జబల్పూర్ (మధ్యప్రదేశ్)లో ఉంటుంది కానీ.. ఆ తర్వాత దేశంలో ఎక్కడైనా సరే వాళ్ళు ట్రాన్స్ఫర్స్ చేస్తారు. మన సొంత రాష్ట్రం కు కూడా పోస్టింగ్ ఇప్పించుకోవచ్చు..కాబట్టి అప్లై చేయండి.
OFJ Recruitment కు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి?
తప్పకుండా ఇవి ఉంటేనే అప్లై చేయండి:
- ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అవ్వాలి
- సోషల్ సైన్స్ లో డిప్లమో గాని డిగ్రీ గాని ఉండాలి
- హిందీ భాష బాగా తెలిసి ఉండాలి
Also Read 👉 AP గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది: డిగ్రీ పాసైతే చాలు
ఇలా సెలక్షన్ చేస్తారు 👇👇
OFJ Recruitment 2025 లో విడుదలైన ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు కానీ వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు (అంటే కచ్చితంగా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా వయసు సరిపోయిందా లేదా అని చెక్ చేస్తారు) అన్ని కరెక్ట్ గా ఉన్నవాళ్లకు మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ ఎప్పుడూ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కేవలం పర్సనల్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా మీకు ఉద్యోగాన్ని ఇస్తారు.
నోట్ : దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా చదివి అర్థం చేసుకున్నారు కదా! సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం:
స్టెప్ 1 : కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ &అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి.
స్టెప్ 2 : అప్లికేషన్ ఫారం ని ప్రింట్ అవుట్ తీసుకొని మీ చేతులతో.. మీ సొంత హ్యాండ్ రైటింగ్ తో నీట్ గా ఫిల్ చేయండి.
స్టెప్ 3 : అప్లికేషన్ ఫారం తో పాటు మీయొక్క సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జత చేయండి సెల్ఫ్ అటెస్టెడ్ చేసినవి (Ex: SSC మార్కులిస్ట్, ఇంటర్ & డిగ్రీ వి, ఆధార్ కార్డు మొదలైనవి)
స్టెప్ 4 : అప్లికేషన్ ఫారం లో ఫోటో అతికించాల్సిన చోట మీ ఫోటోని అతికించండి. అలాగే ఇంకొక ఫోటో తీసుకుని దాని వెనక సైడు మీ పూర్తి పేరు నీటుగా రాయండి ( ఇది ఎన్వలప్ లో పెట్టీ పంపాలి).
స్టెప్ 5 : అన్నీ సరి చూసుకున్న తర్వాత ఒక ఎన్వలప్ తీసుకొని అందులో ఇవన్నీ పెట్టి దానిని సీల్ చేయండి.
స్టెప్ 6 : ఎన్వలప్ పైన From Address దగ్గర: Executive Director, Ordnance Factory Jabalpur, PO : VFJ Estate, Jabalpur (MP) – 482009 రాసి.. స్పీడ్ పోస్ట్/ కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి.
గమనిక : ఈ ఉద్యోగాలకు చివరి తేదీ 26/07/2025, కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.
అప్లికేషన్ ఫారం (ఫార్మాట్ మాత్రమే)
OFJ Recruitment 2025 యొక్క అన్ని వివరాలను మీకు అందించాము..ఇక నోటిఫికేషన్ ఇంకా అప్లికేషన్ ఫారం pdf రూపంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను.. ప్రస్తుతానికి ఇమేజ్ రూపంలోనే ఉన్నాయి. మీకు ఈ సమాచారము హెల్ప్ ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా ఇంకొక పదిమందికి షేర్ చేయండి.