SECR Scouts & Guides Quota Recruitment 2025 : తక్కువ పోటీతో రైల్వేలో జాబ్ కొట్టడానికి అప్లై చేయండి 

Telegram Channel Join Now

SECR Scouts & Guides Quota Recruitment 2025 : తక్కువ పోటీతో రైల్వేలో జాబ్ కొట్టడానికి అప్లై చేయండి

రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలని చెప్పి ఎంత మంది ఎదురు చూస్తున్నారు.. మీ అందరికీ సువర్ణ అవకాశం. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్ సి ఇంకా గ్రూప్ డి లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ వచ్చింది. ఈ SECR Scouts & Guides Quota Recruitment 2025 ఆర్టికల్ లో అర్హతలు, పోస్టుల వివరాలు, ఇంకా ఎంపిక విధానం ఇలా ప్రతి విషయం గురించి క్లియర్ గా వివరించాము…పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి.

SECR Scouts & Guides Quota Recruitment 2025

SECR Scouts & Guides Quota Recruitment 2025 యొక్క పోస్టుల వివరాలు

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) 2025-26 కోసం స్కౌట్స్ & గైడ్స్ కోటాలో 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2 గ్రూప్ ‘C’ (లెవల్-2) పోస్టులు, 6 గ్రూప్ ‘D’ (లెవల్-1) పోస్టులు ఉన్నాయి. లెవల్-2 పోస్టులు SECR రైల్వేలో, లెవల్-1 పోస్టులు బిలాస్‌పూర్, రాయ్‌పూర్, నాగ్‌పూర్ డివిజన్లలో ఉన్నాయి.

JOIN OUR TELEGRAM CHANNEL

అర్హతలు

విద్యార్హత

  • లెవల్-2: 12వ తరగతి (50% మార్కులు) లేదా టెక్నికల్ పోస్టులకు మెట్రిక్యులేషన్ + ITI/అప్రెంటిస్‌షిప్.

  • లెవల్-1: 10వ తరగతి లేదా ITI/జాతీయ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (NAC).

స్కౌటింగ్/గైడింగ్ అర్హత

  • ప్రెసిడెంట్ స్కౌట్/గైడ్/రోవర్/రేంజర్ లేదా హిమాలయన్ వుడ్ బ్యాడ్జ్ (HWB) హోల్డర్.

  • గత 5 సంవత్సరాలుగా స్కౌట్స్ సంస్థలో యాక్టివ్ సభ్యత్వం.

  • 2 జాతీయ/ఆల్ ఇండియా రైల్వే ఈవెంట్లు, 2 రాష్ట్ర స్థాయి ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.

ఇది కూడా చదవండి 👉 లైఫ్ సెట్ అయిపోయే నోటిఫికేషన్: చేరగానే జీతం ₹90000/- 

వయస్సు పరిమితి (01.07.2025 నాటికి)

  • లెవల్-2: 18-30 సంవత్సరాలు.

  • లెవల్-1: 18-33 సంవత్సరాలు.

  • వయస్సు సడలింపు: SC/ST (5 సంవత్సరాలు), OBC (3 సంవత్సరాలు), PwBD, ఎక్స్-సర్వీస్‌మెన్, వితంతువులకు అదనపు సడలింపు.

ఎంపిక విధానం

  • రాత పరీక్ష: 60 మార్కులు (స్కౌట్స్ & గైడ్స్, జనరల్ నాలెడ్జ్, ఎస్సే).

  • సర్టిఫికెట్ మార్కులు: 40 మార్కులు (జాతీయ/రాష్ట్ర/జిల్లా ఈవెంట్లు, స్పెషలైజ్డ్ కోర్సులు).

  • మెడికల్ టెస్ట్: పోస్టింగ్‌కు ముందు తప్పనిసరి.

దరఖాస్తు విధానం

  • ఆన్‌లైన్ దరఖాస్తు: www.secr.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో 14.06.2025 నుంచి 13.07.2025 వరకు.

  • అవసరమైన డాక్యుమెంట్లు: ఫోటో, సంతకం, విద్య, కుల, స్కౌటింగ్ సర్టిఫికెట్లు (JPEG ఫార్మాట్).

👉 అధికారిక నోటిఫికేషన్

👉 అప్లై చేసే లింక్

ఫీజు వివరాలు

  • జనరల్ కేటగిరీ: రూ.500 (రూ.400 రీఫండబుల్).

  • SC/ST, మహిళలు, PwBD, మైనారిటీలు, EBC: రూ.250 (పూర్తిగా రీఫండబుల్).

  • లెవల్-1, లెవల్-2 పోస్టులకు విడివిడిగా ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన సూచనలు

  • అర్హతలు, సర్టిఫికెట్లు సరిగా అప్‌లోడ్ చేయాలి, లేకుంటే దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది.

  • రాత పరీక్ష తేదీ, కాల్ లెటర్ వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అవుతాయి.

  • ఎంపికైన అభ్యర్థులు టైపింగ్ నైపుణ్యం 2 సంవత్సరాలలో సాధించాలి.

మరిన్ని వివరాలకు: SECR వెబ్‌సైట్‌ను సందర్శించండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!

Leave a Comment