TGSRTC Recruitment 2025 : చాలా రోజుల తర్వాత ఆర్టీసీ లో పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఆర్టీసీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సువర్ణ అవకాశం! తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSPLRB) ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని మరియు మెకానికల్ సూపర్వైజర్ ట్రైని ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఆర్టికల్ లో మీకు TGSRTC Recruitment 2025 ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి విషయాలను తెలుగులో అందించడం జరిగింది.. పూర్తిగా చదివి అప్లికేషన్ పెట్టుకోండి.
TGSRTC Recruitment 2025
TGSRTC Recruitment 2025 : మొత్తం ఎన్ని ఉద్యోగాలు విడుదల చేశారు?
TGSRTC Recruitment 2025 ద్వారా రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అవి:
- ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని
- మెకానికల్ సూపర్వైజర్ ట్రైని
ఉద్యోగాల సంఖ్య:
TGSRTC Recruitment 2025 Vacancy Details 2025
TGSRTC Recruitment 2025 : అర్హతలు ఏముండాలి?
TST ( ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని) : ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసైతే చాలు .
MST ( మెకానికల్ సూపర్వైజర్ ట్రైని): డిప్లొమా లేదా B.E/B.Tech (ఆటోమొబైల్ లేదా మెకానికల్ విభాగం) పాసై ఉండాలి.
Also Read 👉 ఇంటర్ పాసైతే ₹40,000/- జీతంతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు: క్లిక్ చేసి అప్లై చేయండి
TGSRTC Recruitment 2025 : జీతం & వయస్సు వివరాలు
| ఉద్యోగం | జీతం | వయస్సు |
| TST | ₹50000/- | 18 నుండి 25 |
| MST | ₹50,000/- | 18 నుండి 25 |
TGSRTC Recruitment 2025 : సెలెక్ట్ ఎలా చేస్తారు?
TGSRTC Recruitment 2025 ద్వారా విడుదలైన ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. కింద ఇచ్చిన ఇమేజ్ లో సెలెక్షన్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది చూడండి 👇👇
TGSRTC Recruitment 2025 Selection Procedure
TGSRTC Recruitment 2025 : ఫీజు వివరాలు
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు కూడా నిర్ణయించడం జరిగింది.. ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో కచ్చితంగా కింద ఇచ్చిన ఫీజును ఆన్లైన్ ద్వారా పే చేయాలి 👇👇
- TST & MST ఉద్యోగాలకు : SC,ST (తెలంగాణ వాళ్ళు మాత్రమే) – ₹400/-
- TST & MTS ఉద్యోగాలకు : మిగతా అందరికీ – ₹800/-
TGSRTC Recruitment 2025 : ఎలా అప్లై చేయాలి?
- ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేయాలి
- 30 డిసెంబర్ 2025 నుండి 20 జనవరి 2026 వరకు సమయం ఇచ్చారు
- మీకు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ స్కాన్ కాపీ తీసుకొని జాగ్రత్తగా ఒక ఫైల్ లో పెట్టుకోండి
- డేట్ స్టార్ట్ అయిన తర్వాత, కింద ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి
- అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకొని భద్రంగా మీ దగ్గర పెట్టుకోండి