Thalliki Vandanam Scheme 2026 నిధులు జులై 10వ తేదీన తల్లుల ఖాతాలో జమ చేస్తారు..అయితే మనం అర్హుల జాబితాలో ఉన్నామో..లేదో..ఇలా తెలుసుకోండి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్ధుల తల్లులకు 13000/- ఆర్ధిక సహాయం అందించే Thalliki Vandanam Scheme 2026 – 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు జులై 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయనుంది, అయితే ఈ పథకానికి అర్హుల జాబితాలో మనం ఉన్నామో..లేదో అని చాలా మందికి టెన్షన్ ఉంది. ఈ ఆర్టికల్ లో మేము స్టేటస్ చెక్ చేసుకునే విధానం, ముఖ్యమైన విషయాలు అన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

Thalliki Vandanam 2026 ఎందుకు ముఖ్యం?
ఈ పథకం ద్వారా పేద & మధ్య తరగతి కుటుంబాలలో ఉన్న విద్యార్ధులకు చదువు ఖర్చు తగ్గించడం లక్ష్యం. చాలా మంది డబ్బులకు బయపడి పిల్లలను పనులకు పంపిస్తున్నారు..ఆ పరిస్థితి మార్చాలనే ఉద్దేశ్యం తో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి 130000/- చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.
Thalliki Vandanam Scheme 2026 ముఖ్యమైన వివరాలు
విడుదల తేదీ : జులై 10, 2026
మొత్తం : ఒక్కొక్క విద్యార్ధికి ₹13,000/- (DBT ద్వారా తల్లుల ఖాతాలో నేరుగా)
తరగతులు : 1వ తరగతి నుండి ఇంటర్ వరకు
ప్రయోజనం : స్కూల్ ఫీజు, యూనిఫాం మొదలగు వాటికి ఉపయోగపడుతుంది
అర్హత నిబంధనలు ( Eligibility Criteria)
తల్లికి వందనం నిధులు పొందాలంటే ఈ క్రింది షరతులు తప్పనిసరి:
- విద్యార్ది స్కూల్ & కాలేజీలో 75% అటెండెన్స్ ఉండాలి.
- తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి.
- E KYC మరియు NPCI మ్యాపింగ్ ఆక్టివ్ గా ఉండాలి.
- కుటుంబ ఆదాయ పరిమితి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలి.
- ప్రైవేట్ & ప్రభుత్వ స్కూల్స్ చదువుతున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.
Also Read 👉 వ్యవసాయ శాఖలో 8వ తరగతి పాసైతే ఉద్యోగాలు
స్టేటస్ ఇలా చెక్ చేయండి 👇 👇
కింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేయండి
అందులో Scheme Eligibility ఆప్షన్ సెలెక్ట్ చేయండి
ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, సంవత్సరం 2026-2027 సెలెక్ట్ చేయండి
OTP వచ్చిన తర్వాత వివరాలు చెక్ చేయండి
ఏదైనా సమస్య ఉంటే స్థానిక సచివాలయం లేదా స్కూల్ మేనేజ్మెంట్ ను సంప్రదించండి