Thalliki Vandanam – అర్జీ పెట్టుకోవడానికి ఆప్షన్ ఓపెన్ అయ్యింది! మీ పేరు అనర్హుల జాబితాలో ఉంటే ఇలా చేయండి.

Telegram Channel Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న Thalliki Vandanam పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి ఖాతాకు ₹15000/- (₹13,000 DBT + ₹2,000/- స్కూల్ అభివృద్ధికి) అందించే ఈ సంక్షేమ పథకం చాలా మంది తల్లులకు బిగ్ రిలీఫ్, కానీ ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు లేకపోవడం, 300 యూనిట్ల కరెంట్, 4 వీలర్, IT రిటర్న్స్ వంటి కారణాలతో అనర్హుల జాబితాలో (ఇన్ Eligible List) చేరినవారు ఇప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు..ప్రభుత్వ వారి కోసం గ్రీవెన్స్ సెల్ ఓపెన్ చేసింది.

మీ అభ్యంతరాలు ( Objections/ Grievances) తీసుకోవడానికి ప్రత్యేక ఆప్షన్ ఓపెన్ చేసింది. సరైన డాక్యుమెంట్లు, సమాచారంతో అర్జీ పెడితే మీ పేరు సప్లిమెంటరీ లిస్టులో చేరి డబ్బులు అందుతాయి.

Thalliki Vandanam Scheme 2026

Thalliki Vandanam Scheme కోసం ఉండాల్సిన అర్హతలు : 2026-27

ప్రభుత్వం నిర్దేశించిన అర్హత నిబంధనలు:

  1. మీ కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు 10,000 లోపు, నగరాలలో అయితే 12 వేల లోపు ఉండాలి.
  2. రైస్ కార్డు కుటుంబంలో ఒకరైన కలిగి ఉండాలి.
  3. మీకు తడి భూమి మూడు ఎకరాలు, పొడి భూమి 10 ఎకరాలు లేదా రెండు కలిపి పది ఎకరాల లోపు ఉండాలి.
  4. కరెంటు వినియోగం సగటుగా నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి.
  5. మీ కుటుంబంలో ఎవరికి 4 వీలర్ ఉండకూడదు.(అయితే టాక్సీలు, ట్రాక్టర్లు & ఆటోలకు మినహాయింపు ఉంది)
  6. మీ కుటుంబంలో ఎవరికి 1000 స్క్వేర్ ఫీట్ పైగా మునిసిపల్ ఆస్తి ఉండకూడదు అలాగే మీ కుటుంబంలో ఎవరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు.
  7. మీ కుటుంబంలో ఎవరూ కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండకూడదు.

విద్యార్థికి ఉండాల్సిన అర్హతలు

ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గుర్తింపు పొందిన స్కూల్స్ & కాలేజీలలో చదువుతుండాలి. కనీసం 75% హాజరు కలిగి ఉండాలి. అయితే ఐటిఐ & పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అరుపులు కారు.

మీ పేరు అనర్హుల జాబితాలో వస్తే ఏం చేయాలి?

  • మీ దగ్గరలో ఉన్న గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్లి, అనర్హుల జాబితాలో రావడానికి గల కారణాలు తెలుసుకోండి.
  • మీరు అర్హులోని భావిస్తే, సచివాలయంలోని DA/ WEDPS లేదా సంబంధిత అధికారి ద్వారా గ్రీవెన్స్ రైస్ చేయండి.
  • ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేయండి

Thalliki Vandanam Status Check Link : Click Here

  • తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి OTP తో వెరిఫై చేయండి.
  • వాట్సప్ మనమిత్ర (9552300009)కి “Hi” అని MSG చేసి స్టేటస్ చూడండి.

డబ్బులు ఎప్పుడు వస్తాయి?

గ్రీవెన్స్ వెరిఫికేషన్ తర్వాత సప్లిమెంటరీ లిస్టు విడుదలవుతుంది. సాధారణంగా జూలై నెలలో డబ్బులు జమవుతాయి. అర్హులైన తల్లులు ఖాతాల్లో నేరుగా DBT ద్వారా వస్తాయి.

అర్జీలు సమర్పించడానికి గడువు త్వరలో ముగిస్తుంది, వెంటనే సచివాలయం సంప్రదించండి లేదా అధికారిక పోర్టల్ లో చెక్ చేయండి.

Leave a Comment