Telegram Channel
Join Now
ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులు తల్లిదండ్రులకు ముఖ్య గమనిక! జూలై 24వ తేదీన(శుక్రవారం), రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీలు & డిగ్రీ కాలేజీ ల తో సహా అన్ని విద్యాసంస్థలు బంద్ పాటించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI,NSUI,AISA,PDSU,DYFI, AIYF వంటి ప్రధాన విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది.

బంద్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి?
ఈ బంద్ ప్రధానంగా NEET UG 2026 ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం పై దేశవ్యాప్త నిరసనలో భాగం. విద్యార్ది సంఘాలు డిమాండ్ చేస్తున్నవి:
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ను రద్దు చేయాలి లేదా పూర్తి స్థాయిలో సంస్కరణలు తీసుకురావాలి.
- డిల్లీలో విద్యార్ధులపై పోలీసుల లాఠీచార్జి జరిగిన ఘటన పైన న్యాయం.
- భవిష్యత్తు లో ఇలాంటివి జరగకుండా పరీక్షల ప్రక్రియను పూర్తి పారదర్శకం చేయాలి
విద్యార్ధుల భవిష్యత్తు ను ప్రభావితం చేసే ఈ సమస్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోనూ ఈ బంద్ కు పిలుపునిచ్చారు.
For More Updates Join Our Whatsapp Channel
విద్యార్ధుల తల్లిదండ్రులు ఏం చేయాలి?
- జూలై 24న స్కూల్స్/కాలేజీలు బంద్ కాబట్టి పిల్లలను పంపవద్దు. స్థానిక అధికారుల/స్కూల్ యాజమాన్యాల ప్రకటనలు పరిగణనలోకి తీసుకోండి.
- జూలై 25న ఏకాదశి కావడం వల్ల ప్రభుత్వ అధికారిక సెలవు మరియు జూలై 26న ఆదివారం కావడంతో లాంగ్ వీకెండ్ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి..పిల్లలను జాగ్రత్త గా చూసుకోండి.