AP Pension Update 2026 : ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభ వార్త! ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ.
ఆంధ్రప్రదేశ్ పెన్షన్ పంపిణీ 2026 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన సూచనలతో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ఈసారి పెన్షన్లు ఒకరోజు ముందుగానే అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ప్రతినెలా 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్లు ఈ జిల్లాలలో జూలై 31వ తేదీ నుండి ఇవ్వనున్నారు.

ఎందుకు ఈ ముందస్తు పంపిణీ?
ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రానున్నారు, ఈ నేపథ్యంలో ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉంది. బందోబస్తు దృశ్య అలాగే ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను స్పష్టంగా ఆదేశించారు- ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే పంపిణీ చేయాలని ఉత్తరాంధ్ర 6 జిల్లాలలో (విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు) ఈ మార్పు అమలు అవుతుంది.
మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి?
మిగతా అన్ని జిల్లాలలో పెన్షన్ పంపిణీ ఆగస్టు 1వ తేదీన సాధారణ విధానం ప్రకారమే కొనసాగుతుంది. ఇక్కడ ఆలస్యం చేయకుండా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పెన్షన్ తీసుకునే వాళ్లకు ముఖ్య సూచనలు
- జులై 31న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెన్షన్ అందుకోవాల్సిన వారు సిద్ధంగా ఉండండి.
- ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా సరిగ్గా ఉండాలి.
- ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత మండల లేదా గ్రామ సెక్రటరీలను సంప్రదించండి.