Aadabidda Nidhi Scheme 2025 : 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ అకౌంట్ లో ₹1500/- జమ, అప్లై చేసుకోండి

Telegram Channel Join Now

Aadabidda Nidhi Scheme 2025 : 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ అకౌంట్ లో ₹1500/- జమ, అప్లై చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త తెలియజేసింది..Aadabidda Nidhi Scheme 2025 కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళా అకౌంట్లో ₹1500/- రూపాయలు జమ చేయనుంది అంటే ఏడాదికి ₹18,000/- రూపాయలు మహిళల ఖాతాల్లో పడతాయి. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఈ పథకం యొక్క అమలుకు కసరత్తులు ప్రారంభించడం జరిగింది.. ఈ ఆర్టికల్ లో ఈ పథకం యొక్క అర్హతలు, అమలు తేదీ, మొదలైన వివరాలను తెలుసుకుందాం.

Aadabidda Nidhi Scheme 2025

అర్హతలు

Aadabidda Nidhi Scheme 2025 కింద ఆర్థిక సాయం పొందేందుకు కింది అర్హతలు కలిగి ఉండాలి :

  • వయస్సు: దరఖాస్తుదారు వయసు 18 ఏళ్ళు కనీసం నిండి ఉండాలి.
  • నివాసం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
  • ధ్రువపత్రాలు: ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా (NPCI లింక్ తప్పనిసరి).
  • ఆదాయ పరిమితి: అల్పాదాయ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వబడవచ్చు.
JOIN OUR TELEGRAM CHANNEL

Aadabidda Nidhi Scheme 2025 ను ఎప్పుడు అమలు చేస్తారు?

విశ్వసనీయ సమాచారం ప్రకారం Aadabidda Nidhi పథకం అక్టోబర్ 2025 నుండి అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం ₹3300/- కోట్ల నిధులను సమీకరిస్తుంది. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి మహిళ లబ్ధి పొందాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది.

ఇది చదవండి 👉 Annadhata Sukhibava Scheme 2025 డబ్బులు పడాలంటే..ఈ నెల 18 తేదీ కల్లా ఈ పని చేయండి..లేకుంటే డబ్బులు పడవు.

దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉండొచ్చు?

Aadabidda Nidhi Scheme 2025 కోసం దరఖాస్తు ప్రక్రియ రెండు విధాలుగా ఉండొచ్చు :
  1. ఆన్లైన్ దరఖాస్తు : రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం కొత్త వెబ్సైట్ ను సిద్ధం చేస్తుంది, త్వరలోనే వెబ్సైట్ పేరు ఇంకా దరఖాస్తు చేసే విధానం అందుబాటులోకి వస్తుంది.
  2. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా : రాష్ట్రంలో ఏ పథకం అమలు కోసం అయినా సచివాలయాలనేది కీలకపాత్ర పోషిస్తాయి, వీటికి కూడా సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

చివరగా నా మాట

Aadabidda Nidhi Scheme 2025 గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా..మన వెబ్సైట్ లో ఇంకా మన సోషల్ మీడియా గ్రూప్స్ (టెలిగ్రామ్, వాట్సప్ ) ద్వారా మీకు ఎప్పటికప్పుడు..తెలియజేస్తూ ఉంటాము అలాగే అధికారిక వెబ్సైట్ ను కూడా ఫాలో అవుతూ ఉండండి..ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడితే..ఇతరులకు షేర్ చేసి సహాయపడగలరు.

Leave a Comment