Annadhata Sukhibava Scheme 2025 : కొత్త అప్డేట్; భూమి లేని రైతుకు కూడా సొమ్ము
రైతులందరికీ శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రారంభించిన ” Annadhata Sukhibava Scheme” జూలై 2025 తొలి వారంలో ప్రారంభించబోతుంది. 4.77 లక్షల రైతుల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. PM కిసాన్ యోజనతో సమన్వయం చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఈ పథకం సంబంధించిన కొత్త అప్డేట్ రావడం జరిగింది దాని గురించి ఈ ఆర్టికల్లో మీకు తెలుగులో వివరించడం జరిగింది.

Annadhata Sukhibava Scheme 2025 కు ఎవరు అర్హులు? ఎంత సాయం?
ఈ పథకం ద్వారా ఒక్కో రైతుకు ఏటా 20వేల రూపాయలు సహాయం అందించనున్నారు అందులో:
- PM కిసాన్ యోజనతో: ₹6000/-
- రాష్ట్ర ప్రభుత్వం తరఫున: ₹14000/-
కొత్త అప్డేట్ : భూమిలేని కౌలు రైతులకు కూడా ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు, అయితే కౌలు రైతులకు సహాయం రెండు విడతల్లో అందిస్తారు. తొలి విడత గా ₹7000/- రూపాయలు నెలాఖరులో జమ చేయబడతాయి.
అర్హత కోసం అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- బ్యాంకు ఖాతా వివరాలు
- భూమి పత్రాలు (కౌలు రైతులకు CCR)
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
ఇది చదవండి 👉 త్వరలోనే AP లో నిరుద్యోగ భృతి ప్రారంభం : మంత్రి నారా లోకేష్; ఇవే అర్హతలు
eKYC మరియు గ్రీవెన్స్ వివరాలు
98% మంది రైతులు eKYC అప్డేట్ చేసుకున్నారు…మిగతావాళ్ళు రైతు సేవ కేంద్రాల (RSK) ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఫిర్యాదుల కోసం ADSB పోర్టల్ https://annadathasukhibhava.ap.gov.in/ అందుబాటులో ఉంది.