AP District Court Recruitment 2025 : సొంత జిల్లా కోర్టులో అటెండర్ ఉద్యోగాలు విడుదల, 7th,10th అర్హతలతో!
AP District Court Recruitment 2025 : చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కోర్టుల్లో ఉద్యోగాలు సంపాదించాలి అని, మరి మీకోసమే అన్నట్టుగా మన AP District Court లో అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇంత తక్కువ పోటీతో మళ్ళీ ఇలాంటి అవకాశం రానే రాదు! రాత పరీక్ష లేదు, ఫీజు లేదు..ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు ఈ AP District Court Recruitment 2025 ఆర్టికల్ లో చాలా వివరంగా అర్థమయ్యేటట్లు తెలుగులో రాయడం జరిగింది.. పూర్తిగా చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

ఎందుకు వీటికి తక్కువ పోటీ ఉంటుంది?
చూడండి..AP District Court Recruitment 2025 లో విడుదలైన కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఫీజు రెండు లేకపోయినా ఇవి అటెండెంట్ ఉద్యోగాలు కాబట్టి.. కొంచెం తక్కువ స్థాయి పోస్టులు, జడ్జిల ఇళ్లల్లో ఇంకా కోర్టుల్లో వాళ్లు చెప్పిన పని చేయాల్సి ఉంటుంది.. పని వేళలు కూడా తక్కువే. పైగా ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు. ఇంకా వీటి గురించి కింద మీకు వివరంగా చెప్పడం జరిగింది, అప్పుడు మీకు అర్థమవుతుంది వీటికి ఎందుకు తక్కువ పోటీ ఉంటుంది అని..!
AP District Court Recruitment 2025 యొక్క పూర్తి వివరాలు
✅విద్యార్హతలు:
- కేవలం 7వ తరగతి లేదా 10వ తరగతి పాస్ అయితే చాలు
- 10వ తరగతి కంటే పై చదువులు చదివిన వాళ్ళు వీటికి అర్హులు కాదు
Also Read 👉 భారీగా అటెండర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: 10th పాస్ అయితే చాలు
✅వయస్సు:
- కనీస వయసు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయసు: 42 సంవత్సరాలు
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST & BC అభ్యర్థులకు వయసులో సడలింపులు వర్తిస్తాయి
మరి వీటికి ఎంపిక ఎలా చేస్తారు?
నిజంగా AP District Court Recruitment 2025 అనేది మన నిరుద్యోగుల పాలిట వరం లాంటిదే! ఎందుకంటే వీటికి ఎటువంటి రాత పరీక్ష లేదు అలాగే ఫీజు కూడా లేదు. వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని పరిశీలించి.. అన్నీ సరిగ్గా పెట్టి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తారు. ఒకవేళ ఈ ఉద్యోగానికి 20 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే అప్పుడు షార్ట్ లిస్ట్ చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఒకవేళ ఎగ్జామ్ పెడితే ఎలా ఉండొచ్చు?
ఇవి 7వ తరగతి & 10వ తరగతి అర్హతలతో భర్తీ చేసే ఉద్యోగాలు కాబట్టి ఒకవేళ పరీక్ష పెట్టినా.. చాలా సులభంగా పాస్ అవ్వచ్చు. కింద మీకు ఏం చదవాలో ఇచ్చాం చూడండి 👇
- బేసిక్ ఆర్థమాటిక్
- బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్
- రీజనింగ్
- 6 నెలల కరెంట్ అఫైర్స్ ( ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి)
Also Read 👉 డిగ్రీ అర్హతతో AP గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగాలు : జీతం ₹25,000/-
సెలెక్ట్ అయితే వచ్చే జీతం 💰
ఈ ఉద్యోగాలకు తక్కువ పోటీ ఉండడానికి గల కారణాలలో జీతం కూడా ఒక కారణం 👇👇
- నెలకు :₹6000/- రూపాయలు మాత్రమే
📌నా సలహా : తక్కువ జీతం వస్తుంది కదా ఇది కాంట్రాక్టు ఉద్యోగం కదా ఎందుకులే అని అప్లికేషన్ పెట్టుకోకుండా ఉండకండి.. బాగా ఆలోచించండి! మనము కోర్టులలో పనిచేయబోతున్నాము.. కొన్ని రోజులు కాంట్రాక్టుగా చేసినా తర్వాత పరిచయాలు పెంచుకొని నిదానంగా పర్మనెంట్ చేసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

ఇప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం 👇 👇
- ఈ ఉద్యోగాలకు మనము ఆఫ్ లైన్ ద్వారా.. అంటే నేరుగా కోర్టుకెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- కింద ఇచ్చిన లింకుల ద్వారా అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ వివరాలతో నీట్ గా ఫిల్ చేసి & జిరాక్స్ కాపీల పైన మీ సంతకాలు చేసి అప్లికేషన్ ఫారం తో అటాచ్ చేయండి.
- అప్లికేషన్ ఫారం తో పాటు కింద ఇచ్చిన సర్టిఫికెట్లు తప్పనిసరిగా అటాచ్ చేయాలి :
- మీ 7th లేదా 10th సర్టిఫికెట్లు జిరాక్స్
- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
- మీరు లోకల్ వాళ్లు అని నిర్ణయించే రెసిడెన్స్ సర్టిఫికెట్
- సెల్ఫ్ అడ్రస్ రాసిన ఎన్వలప్ దానిపైన కచ్చితంగా స్టాంపు వేసి ఉండాలి అలాగే Acknowledgement కూడా చేసి ఉండాలి.. రిజిస్టర్ పోస్ట్ చేయడానికి అనుకూలంగా.
- అప్లికేషన్ ఫారం లో ఫోటో అతికించండి.
- అప్లికేషన్ ఫారం లో మీ సంతకం కూడా తప్పనిసరిగా చేసి ఉండాలి.
👉అధికారిక నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం
పైన చెప్పిన విధంగా అన్నీ చేసిన తర్వాత ఒక ఎన్వలప్ తీసుకొని ఇవన్నీ అందులో పెట్టి సీల్ చేసి ఎన్వలప్ పైన మీ అడ్రస్ తప్పకుండా రాసి అలాగే “జిల్లా కోర్టు రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్” అని రాయాలి.
చివరి తేదీ : 30/07/2025 సాయంత్రం 05:00 గంటలకల్లా కోర్టులో సమర్పించాలి.