AP DSC 2025 : పరీక్ష తేదీల మార్పు, కొత్త షెడ్యూల్ వివరాలు, మారిన తేదీలతో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జూన్ 21, 2025న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో AP DSC 2025 పరీక్షల తేదీలో మార్పులు చేయడం జరిగింది. ఈ తేదీ మార్పుల కారణంగా జూన్ 20 ఇంకా 21వ తేదీలలో జరగాల్సిన పరీక్షలు జూలై 01 మరియు 2వ తేదీల్లో జరుగుతాయని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ఆర్టికల్ లో మీకు AP DSC పరీక్ష తేదీల మార్పు ఇంకా హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇతర ముఖ్యమైన విషయాలను వివరంగా తెలియజేయడం జరిగింది.
AP DSC 2025 గురించి పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి AP DSC (Andhra Pradesh District selection committee) 2025 మెగా రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్కూల్ అసిస్టెంట్స్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ట్రెండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ప్రిన్సిపల్స్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వంటి పోస్టులను భర్తీ చేస్తారు. కంప్యూటర్ బేస్ టెస్ట్ ఆధారంగా జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తారీకు వరకు జరగాల్సిన పరీక్షలు అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా జూలై 1,2వ తేదీలకు మార్చబడ్డాయి.
AP DSC 2025 కొత్త హాల్ టికెట్ డౌన్లోడ్ వివరాలు
మారిన తేదీలకు సంబంధించిన కొత్త హాల్ టికెట్లు అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.in లో జూన్ 25, 2025 నుండి అందుబాటులో ఉంటాయి. అభ్యర్ధులు తమ లాగిన్ క్రెడిన్షియల్స్ ( యూజర్ ఐడి, పాస్ వర్డ్ ) ఉపయోగించి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
హాల్ టికెట్ లో ఉండే వివరాలు :
- అభ్యర్థి పేరు
- ఫోటో
- సంతకం
- పరీక్ష తేదీలు
- సమయం
- పరీక్షా కేంద్రం వివరాలు
- ఇతర ముఖ్య సూచనలు ఉంటాయి
గమనిక : అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా పరిశీలించి ఏవైనా తప్పులు ఉంటే హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలి. పరీక్షా కేంద్రం కు హాల్ టికెట్ తో పాటు ఒక ఫోటో ఐడి ప్రూఫ్ ను ( ఆధార్, ఓటర్ ఐడీ , డ్రైవింగ్ లైసెన్స్) కచ్చితంగా తీసుకెళ్లండి.
ఇది కూడా చదవండి 👉 అటవీశాఖ లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు: జీతం ₹25000/-
AP DSC హాల్ టికెట్ ను ఎలా డౌన్లోడ్ చేయాలి
- అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in ఓపెన్ చేయండి
- హోమ్ పేజీలో “Hall Ticket Download” లింక్ పైన క్లిక్ చేయండి
- మీ లాగిన్ ఐడి, పాస్ వర్డ్ ను ఉపయోగించి, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి
- హాల్ టికెట్ ను ప్రింట్ తీసి పరీక్ష రోజు తీసుకెళ్లండి
చివరగా నా మాట
AP DSC 2025 మెగా రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనే వారికి చాలా మంచి అవకాశం. పైన చెప్పిన విధంగా మీరు మారిన తేదీల హాల్ టికెట్లు చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబోయే ఉపాధ్యాయులందరికీ ఆల్ ది బెస్ట్!