CCRAS Recruitment 2025 : 10th, ఇంటర్ పాసైన వాళ్ల కోసం 388 పోస్టులతో భారీ నోటిఫికేషన్ (షార్ట్ నోటీస్) విడుదల
CCRAS Recruitment 2025 : 10th, ఇంటర్ పాస్ అయ్యి..ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ల కోసం ఒక శుభవార్త! CCRAS (Central Council for Research in Ayurvedic Sciences) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి 388 పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చింది. దీనికోసం వాళ్లు ఒక షార్ట్ నోటీస్ విడుదల చేయడం జరిగింది. ఇందులో MTS, LDC మరియు ఇతర గ్రూప్ – ఏ,గ్రూప్ – బి, గ్రూప్ – సి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. తక్కువ అర్హతతోనే ఒక మంచి పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకుంటే ఈ నోటిఫికేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది.. మీకు ఈ CCRAS Recruitment 2025 ఆర్టికల్ లో పూర్తి వివరాలను తెలుగులో అందించాము చదవండి.
మొదట ఈ షార్ట్ నోటీస్ ఎందుకు విడుదల చేస్తారో తెలుసుకుందాం!
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు నోటిఫికేషన్ గురించి ముందుగానే తెలుసుకోవడం వల్ల.. వాళ్ల ప్రిపరేషన్ ను మెరుగుపరుచుకుంటారు అని ఇలా షార్ట్ నోటీస్ విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు CCRAS Recruitment 2025 యొక్క షార్ట్ నోటీస్ విడుదలైంది కాబట్టి.. ఏమి ఉద్యోగాలు ఉన్నాయి? ఎప్పుడు అధికారిక ఫుల్ నోటిఫికేషన్ రాబోతుంది? ఎలా చదువుతే ఈ ఉద్యోగాలను మనం సొంతం చేసుకోగలుగుతాము? అనే విషయాలు ప్లానింగ్ చేసుకోవడానికి మంచిగా వీలుంటుంది.
మరి ఈ CCRAS Recruitment 2025 షార్ట్ నోటీస్ లో ఏమి ఉద్యోగాలున్నాయో..చూద్దాం!
- Group-A: రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులు – 21
- Group-B: అసిస్టెంట్లు, స్టాఫ్ నర్స్ & ఇతర పోస్టులు మొత్తం – 48
- Group-C: LDC, UDC, జూనియర్ క్లర్క్ & MTS పోస్టులు మొత్తం కలిపి – 319
Also Read 👉 తక్కువ పోటీతో అటెండర్ ఉద్యోగాలు : ఇప్పుడే అప్లై చేసుకోండి
వీటికి అర్హతలు
మనకి ఇప్పుడు వచ్చిన CCRAS Recruitment 2025 షార్ట్ నోటీసులో ఎటువంటి అర్హతల గురించి తెలియజేయలేదు, కానీ జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్పడంలో మనకున్న 10ఏళ్ల అనుభవం ఉపయోగించి.. కొన్ని పోస్టులకు అర్హతలు ఇవి ఉండొచ్చు అని కింద తెలియజేశాము చూడండి 👇👇
- UDC పోస్టులకు : ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అర్హత.
- LDC పోస్టులకు : 10+2 or ఇంటర్ పాస్ అయి ఉండాలి .
- MTS పోస్టులకు : 10th పాస్ ( నోటీసులో మనకు వివిధ రకాల MTS ఉద్యోగాలు మెన్షన్ చేశారు.. కాబట్టి పోస్ట్ అనుసరించి సంబంధిత పనిలో నైపుణ్యం కూడా ఉండాల్సి ఉంటుంది)
📌ఎటువంటి అనుభవం వీటికి అడగరు.
📌 వయస్సు గురించి కూడా నోటీసు లో ఇవ్వలేదు.
ఇతర ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుస్తుంది. పైన చెప్పిన ఉద్యోగాలకు 99% అర్హత మేము చెప్పిన విధంగానే ఉంటుంది కాబట్టి అర్హత ఉన్న వాళ్ళు ఇప్పటినుండే ప్రిపరేషన్ మొదలు పెట్టండి👍.
Also Read 👉 లేబర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ : ఉండడానికి ఇల్లు కూడా ఇస్తారు జాబు వస్తే..అప్లై చేయండి
వీటికి ఎంపిక ఎలా చేస్తారు?
చూడండి మనకు షార్ట్ నోటీసులో ఎంపిక ఎలా చేస్తారు అనే దాని గురించి ఇవ్వడం జరిగింది.. సంతోషకరమైన విషయం! ఎందుకంటే మనం ప్రిపరేషన్ ఎలా చేయాలో అర్థం అవుతుంది.
✅Group – A పోస్టులకు : CBT విధానంలో పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 70 మార్కులకు మరియు ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది.
✅Group-B & C పోస్టులకు : వీటికి మాత్రం కేవలం 100 మార్కులకు రాత పరీక్ష మాత్రమే ఉంటుంది ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. కాకపోతే స్కిల్ టెస్ట్ మాత్రం కండక్ట్ చేస్తారు.
గమనిక : MTS ఉద్యోగాలకు తప్పించి.. మిగతా అన్ని ఉద్యోగాలకు రాత పరీక్షలో తప్పుగా రాసిన సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది.
సిలబస్ ఏమి చదవాలి?
మనకు CCRAS Recruitment 2025 షార్ట్ నోటీస్ లో ఎటువంటి సిలబస్ గురించి మెన్షన్ చేయలేదు..కాని మేము మాకున్న అనుభవంతో UDC, LDC మరియు MTS ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ఇస్తున్నాము మీకోసం..తప్పకుండా బాగా ప్రిపేర్ అవ్వండి 🤝
👆👆 ఇక్కడ మీకు సాధారణంగా కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలైన UDC, LDC మరియు MTS పోస్టులకు సిలబస్ ఇచ్చాము, కాకపోతే పోస్టు స్థాయిని బట్టి పరీక్ష Hardness పెరుగుతుంది.. టాపిక్స్ మాత్రం పైన ఇచ్చినవే ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు
- అప్లై చేయడానికి అధికారిక తేదీ : 01/08/2025
- చివరి తేదీ: 31/08/2025
- ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి.
ఫ్రెండ్స్! పూర్తి మొత్తం CCRAS Recruitment 2025 ఆర్టికల్ చదివారు కదా, నోటీసు లో ఇచ్చిన సమాచారం ఆధారంగా మీకు అర్థమయ్యే విధంగా ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. మనకు ఇకా సమయం ఉంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటినుండి ఈ ఉద్యోగాలను ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రిపరేషన్ మొదలు పెట్టండి. పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మేము మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాము.ఆల్ ది బెస్ట్ 🤝