APSHCL Recruitment 2026 : AP హౌసింగ్ కార్పొరేషన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

Telegram Channel Join Now

APSHCL Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ విధానంలో DEO ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త! APSHCL Recruitment 2026 ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం టెక్నికల్ ( డేటా ఎంట్రీ) పరీక్ష పెట్టి సెలెక్షన్ చేసుకుంటారు. అనుభవం కూడా అవసరం లేదు, మీకు సొంత రాష్ట్రంలో జాబ్ చేయాలనుంటే ఈ APSHCL(ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్) నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం, ఈ ఆర్టికల్ లో మీకు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది..తెలుసుకుని అప్లై చేయండి.

APSHCL Recruitment 2026

APSHCL నోటిఫికేషన్ లో విడుదలైన ఉద్యోగాలు

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 04 పోస్టులు
కేటగిరి పోస్టుల సంఖ్య
SC Women 01
OC Women 03

 

Join Our Telegram Channel

అర్హతలు

  • ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి PGDCA(Postal Graduate Diploma in Computers) చేసి ఉండాలి. (Or)
  • BSc(Comp) లేదా B.Com (Comp) ఉండాలి.

Also Read 👉 అర్హత తక్కువ..జీతం ఎక్కువ ఇచ్చే ఉద్యోగాలు విడుదల : క్లిక్ చేసి అప్లై చేయండి

వయస్సు

ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం అప్లై చేయడానికి మీకు ఉండాల్సిన వయస్సు :

  • OC అభ్యర్ధులకు : 18 నుండి 42
  • SC అభ్యర్ధులకు : 18 నుండి 47

జీత భత్యాలు

APCOS ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి మీకు నెలకు జీతం ₹18,500/- ఇస్తారు.

సెలెక్షన్ విధానం

ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు..కానీ టెక్నికల్ పరీక్ష పెట్టి ఉద్యోగాలకు సెలక్షన్ చేసుకుంటారు. మీరు టైపింగ్ లో మంచి ప్రతిభ కనబరిస్తే ఉద్యోగం మీ సొంతం చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ

ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి, http://ananthapuramu.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి లేదా కింద మీకు అప్లికేషన్ ఫారం మరియు నోటిఫికేషన్ లింకు డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది, అక్కడి నుండైనా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునేటప్పుడు జతపరచవలసిన సర్టిఫికెట్లు:

APSHCL Recruitment 2026

దరఖాస్తు ఇవ్వాల్సిన అడ్రస్

కింద ఇచ్చిన అడ్రస్ కు అప్లికేషన్ ఫారం తో పాటు పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసి చివరి తేదీ లోపల దరఖాస్తును సమర్పించాలి.

అడ్రస్: O/o District Head – Housing,Gulzarpet, Anantapur, Andhra Pradesh 515001

చివరి తేదీ: 10/06/2026

ముఖ్యమైన లింకులు

Leave a Comment