CSIR NML MTS Recruitment 2026 | 10th పాసైతే ₹36,000/- జీతంతో అటెండర్ ఉద్యోగాలు

Telegram Channel Join Now

CSIR NML MTS Recruitment 2026 : ప్రభుత్వ అటెండర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది

2025 సంవత్సరం వెళ్ళిపోయింది, 2026 సంవత్సరం వచ్చేసింది! అలాగే వస్తూ వస్తూ మనకోసం కేంద్ర ప్రభుత్వ MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్ తీసుకొచ్చేసింది. ఎలాగైనా మనందరం ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం కొట్టాల్సిందే అండి.. అనుభవం అవసరం లేదు, ఒక్క రాత పరీక్ష పాస్ అయితే మన లైఫ్ సెట్టు! CSIR NML MTS Recruitment 2026 ద్వారా పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఆర్టికల్ లో తెలుగులోనే మీకు అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది… పూర్తిగా చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

CSIR NML MTS Recruitment 2026CSIR NML MTS Recruitment 2026

CSIR NML అంటే జాతీయ మెటలర్జికల్ లాబరేటరీ.. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడ మెటలర్జికల్ ఇంకా మెటీరియల్స్ పైన దేశవ్యాప్తంగా రీసర్చ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ జాబ్ కొట్టడం అంటే మన లైఫ్ సెట్ అయిపోవడం. ఈ లేబరేటరీ లో పని చేయడానికి 22 మంది ఎంటిఎస్ లు కావాలి. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లకు ఇంకా అందరికీ అవకాశం కల్పించడం జరిగింది.

Join Our Telegram Channel 

ఈ CSIR NML లో మొత్తం ఎన్ని పోస్టులు విడుదలయ్యాయి?

ఇక్కడ మొత్తం 22 MTS పోస్టులు విడుదలయ్యాయి అందులో వివిధ రకాల MTS సంబంధించిన పోస్టులు ఉన్నాయి..కింద చూడండి 👇👇

CSIR NML MTS Recruitment 2026CSIR NML MTS Vacancy Details

అర్హతలు ఏంటి?

పైన మీకు ఇచ్చిన ఇమేజ్ చూశారు కదా? ఏమైనా అర్థమైందా? పర్లేదు నేను కింద వివరంగా చెప్తాను :

  • ఇక్కడ విడుదలైన పోస్టులు అన్ని కూడా MTS క్యాడర్ కు సంబంధించినవే..కానీ ఒక 14 పోస్టులకు మాత్రమే కేవలం అర్హత : 10th మాత్రమే
  • మిగతా 8 పోస్టులకు 10+ ITI ( సంబంధించిన విభాగంలో ఉండాలి)

నోట్: కింద పోస్ట్ కోడ్ ఇంకా క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి 👇 👇

CSIR NML MTS Recruitment 2026CSIR NML MTS Qualification Details

Also Apply 👉 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, కేవలం 12th అర్హతతో అప్లై చేయండి 

CSIR NML MTS ఉద్యోగాలకు వయసు ఎంత ఉండాలి?

పోస్టు వయస్సు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 18 నుండి 25

నోట్ : SC,ST & OBC వాళ్లకు వయసు లో రిలాక్సేషన్స్ వర్తిస్తాయి.

జీతం ఎంత వస్తుంది? ఫీజు ఎంత కట్టాలి?

పోస్టు జీతం ఫీజు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ₹36,000/- ₹500/- ( కేవలం జనరల్ క్యాటగిరి లోని మగవాళ్లకు మాత్రమే) మిగతా అందరికీ ఫ్రీ

 

సెలక్షన్ ప్రాసెస్ మరియు ఎగ్జామ్ ప్యాట్రన్ ఎలా ఉంటుంది?

సెలెక్షన్ ప్రాసెస్:
  • చాలా సింపుల్ అండి.. కేవలం ఒకే ఒక్క రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
  • కంప్యూటర్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
  • ఎవరికి అయితే మెరిట్ వస్తుందో.. వాళ్లకి స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ ఇస్తారు.
ఎగ్జామ్ పాటర్న్ :

CSIR NML MTS Recruitment 2026

అప్లై ఎలా చేయాలి & ముఖ్యమైన తేదీలు

ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి ఇక్కడ లింక్ ఇచ్చాను 👇👇

  • Apply స్టార్ట్ డేట్: 05/01/2026
  • Apply క్లోజింగ్ తేదీ: 02/02/2026

Leave a Comment