Indian Coast Guard Recruitment 2025 : 10th క్లాస్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల
నిరుద్యోగులకు శుభవార్త! ఇండియన్ కోస్ట్ గాడ్ నుంచి అధికారికంగా గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే మనము చాలా సులభంగా ఈ ఉద్యోగాలని సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉద్యోగాలు వస్తే ఆ పని చేయడానికి చాలామంది ఇష్టపడరు తగ్గించుకోలేరు.. మీరు కానీ అప్లికేషన్ చేస్తే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలోని మగవాళ్ళు అలాగే ఆడవాళ్లు ఇద్దరు కూడా ఈ Indian Coast Guard Recruitment 2025 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకోసం అర్థమయ్యే విధంగా తెలుగులో ఈ ఆర్టికల్ రాయడం జరిగింది పూర్తిగా చదివి.. అప్లై చేసుకోండి.

Indian Coast Guard Recruitment 2025 : అసలు ఏవేవి ఉద్యోగాలు విడుదలయ్యాయి?
ఈ నోటిఫికేషన్లు మొత్తం మూడు రకాల ఉద్యోగాలు విడుదలయ్యే కానీ మనం అప్లై చేసుకోవాల్సింది కేవలం రెండు రకాల ఉద్యోగాలకు మాత్రమే..అవి ఏంటంటే:
👉MTS (Peon)
👉MTS (Sweeper)
Indian Coast Guard Recruitment 2025 : వీటికి ఉండాల్సిన అర్హతలు ఏంటి?
మీకు ఇక్కడ ఇమేజ్ ఇస్తాను దాంట్లో మీకు స్పష్టంగా అర్హతలు ఏంటో ఉన్నాయి 👇👇

Indian Coast Guard Recruitment 2025 : జీతం, వయస్సు వివరాలు
| ఉద్యోగం పేరు | జీతం | వయస్సు |
| MTS (Peon) | ₹40,000/- (అన్ని అలవెన్స్ కలుపుకొని) | 18 – 27 |
| MTS (Sweeper) | ₹40,000/- (అన్ని అలవెన్స్ కలుపుకొని) | 18 – 27 |
గమనిక: భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
Also Read 👉 10th అర్హతతో సైనిక్ స్కూల్ లో అటెండర్ ఉద్యోగాలు విడుదల: అప్లై చేసుకోండి
Indian Coast Guard Recruitment 2025 : సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Indian Coast Guard Recruitment 2025 ద్వారా విడుదలైన ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్, మిగతా ఉద్యోగాలతో పోలిస్తే చాలా సులభంగా మనం క్రాక్ చేయవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ ఉద్యోగాలకు పెట్టే పరీక్షలో ఎటువంటి నెగటివ్ మార్కింగ్ ఉండదు.. అందువల్ల ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ పెట్టి రావచ్చు.

Indian Coast Guard Recruitment 2025 : దరఖాస్తు చేసుకునే విధానం
- మీకు అన్ని అర్హతలు సరిపోతాయనుకున్న వాళ్లు కింద నేను ఇచ్చిన లింకు పైన క్లిక్ చేయండి.
- అక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
- మీ చేతిరాతతో ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ ఫారం ని పూరించండి.
- మీయొక్క విద్యా అర్హతల సర్టిఫికెట్లను జిరాక్స్ కాపీలు తీసి దానిపైన మీ సంతకాలు చేయండి ( దీనిని సెల్ఫ్ అటెస్ట్ అంటారు)
- ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఫ్రీగా అప్లై చేయొచ్చు.
- అప్లికేషన్ ఫారం, మీ జిరాక్స్ సర్టిఫికెట్లు, ఒక ఖాళీ ఎన్వలప్ దానిపైన 50 రూపాయల విలువ గల స్టాంపు అతికించి.. మెయిన్ ఎన్వలప్ లో పెట్టండి.
- కింద ఇచ్చిన అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించండి :
- Directorate of Recruitment
Coast Guard Headquarters,
Coast Guard Administrative Complex
C-1, Phase II, Industrial Area,
Sector-62,Noida,
U.P. – 201309