Sainik School Recruitment 2025 : 10th పాసైతే చాలు ప్రభుత్వ స్కూల్ లో అటెండర్ ఉద్యోగాలు

Telegram Channel Join Now

Sainik School Recruitment 2025 : ఒక్క అప్లికేషన్ పెట్టండి..ప్రభుత్వ స్కూల్ లో జాబ్ కొట్టండి!

చాలామంది మాకు వయసు అయిపోయింది మేం చదివింది టెన్త్ క్లాస్ మాత్రమే.. ఇంక మాకేమి ఉద్యోగాలు వస్తాయిలే అని చెప్పి నిరుత్సాహంలో ఉండిపోతారు. మీకోసమే అన్నట్టుగా సైనిక్ స్కూల్ కొడగు నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. మీరు చదువు ఆపేసి ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా లేకపోతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నా అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ Sainik School Recruitment 2025 ద్వారా విడుదలైన వార్డ్ బాయ్ ఉద్యోగాలకు ఎలిజిబుల్. మీకోసం తెలుగులో స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ఉద్యోగాల గురించి రాయడం జరిగింది. అందరూ తప్పకుండా చదివి తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోండి మర్చిపోవద్దు.

Sainik School Recruitment 2025

Sainik School Recruitment 2025 : ఈ ఉద్యోగాల గురించి బ్రీఫ్ గా..

చూడండి ఫ్రెండ్స్! మనకు మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కూడా ఉంది అక్కడ వీడియో రూపంలో మీకు ఈ జాబ్స్ గురించి తెలియజేశాను.. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వీడియో లింక్ ఇచ్చాను చూడండి. ఇక ఈ ఉద్యోగాల గురించి వస్తే ఇవి కాంట్రాక్టు బేసిస్ పద్ధతి ద్వారా భర్తీ చేస్తున్నారు, అలాగని ఇవి ఆషామాషీ ఉద్యోగాలు కావు నిదానంగా పర్మనెంట్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సైనిక్ స్కూల్ అనేవి కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.. ఇవి డైరెక్ట్ ప్రభుత్వానికి సంబంధించినవి కాకపోయినా ఆ యొక్క ఉద్యోగుల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తాయి.. మనము గానీ ఇందులో ఉద్యోగం సంపాదిస్తే మన భవిష్యత్తుకు ఎలాంటి డోకా ఉండదు కాబట్టి అందరూ తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి👍

Join Our Telegram Channel

Sainik School Recruitment 2025 : ఎన్ని పోస్టులు విడుదలయ్యాయి?

Sainik School Recruitment 2025 లో భాగంగా రెండు రకాల పోస్టులు విడుదలయ్యాయి.. కానీ నేను ఇక్కడ వార్డ్ బాయ్ ఉద్యోగాలనే ప్రముఖంగా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Sainik School Recruitment 2025

👉 మొత్తం పోస్టుల సంఖ్య : 03 (ఆడ&మగ ఇద్దరు అర్హులే)

Sainik School Recruitment 2025 : ఉండాల్సిన విద్యార్హతలు ఏంటి?

Sainik School Recruitment 2025 లో విడుదలైన ఉద్యోగాలకు మరీ ఎక్కువ చదివి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు.. మీరు అప్పుడెప్పుడో చదివి ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.. ఇంకో విషయం ఓపెన్ లో కూడా చదివిన అర్హులే.

👉 అర్హత : కేవలం పదవ తరగతి పాస్ అయి ఉంటే చాలు.

📌ముఖ్య గమనిక : పదో తరగతి కంటే ఎక్కువ చదివిన మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.. మీలాంటి వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

Sainik School Recruitment 2025 : వీటికి ఎంత వయసు ఉండాలి?

అందరూ ఏమనుకుంటారంటే.. మాకు ఏజ్ బార్ అయిపోయింది మేం ఇప్పుడు ఇంకేమీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి? మా లైఫ్ ఇంతే ప్రైవేట్ జాబ్ చేసుకోవాల్సిందే అని చాలామంది భావిస్తారు, కానీ సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఏజ్ అనేది అసలు అడ్డమే కాదు.

👉 ప్రతి ఒక్కరు : 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటే అప్లై చేసుకోవచ్చు.

Sainik School Recruitment 2025 : అప్లై చేయడానికి ఫీజ్ ఏమైనా ఉందా?

అవును ఉంది! అన్ని ఉద్యోగాలు లాగానే వీటికి కూడా దరఖాస్తు చేయడానికి ఫీజ్ అనేది కట్టాల్సి ఉంటుంది.. అయితే మీరు భయపడాల్సిందే ఏమీ లేదు, మనం ఎన్నింటికో వృధాగా ఖర్చు పెడుతూ ఉంటాం ఇది మన లైఫ్ కు సంబంధించింది కాబట్టి సో దీనికి నిరభ్యంతరంగా ఫీజు కట్టొచ్చు :

కేటగిరీ  ఫీజు
జనరల్& OBC ₹500/-
SC, ST ₹350/-

అయితే మనం ఈ ఫీజు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.. అంటే ఏదైనా జాతీయ బ్యాంకుకు వెళ్లి ‘The Principal Sainik School Kodagu’ payable at Kushalnagar Branch (Karnataka State) అనే పేరుతో డి.డి తీయాలి.

Sainik School Recruitment 2025 : సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

దరఖాస్తు చేసుకున్న వారికి షార్ట్ లిస్ట్ తీసి.. ఎవరైతే ఎలిజిబుల్ కాండిడేట్స్ ఉంటారో వాళ్లకు పోస్టు ద్వారా మీ పరీక్ష తేదీ అలాగే సమయం ఇంకా ప్లేస్ ఎక్కడ అనేది సమాచారం ఇస్తారు. కేవలం పదో తరగతి లెవెల్లో పరీక్ష పెట్టి ఎంపిక చేయడం జరుగుతుంది.

Also Read 👉 ఒక చిన్న పరీక్ష పెట్టి ప్రభుత్వ ఉద్యోగం: చేరగానే జీతం ₹70,000/- 

ప్రిపేర్ అవ్వాల్సిన అంశాలు:

  • రీజనింగ్
  • బేసిక్ అర్థమెటిక్
  • బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ స్కిల్స్
  • కరెంట్ అఫైర్స్ & స్టాండర్డ్ G.K

Sainik School Recruitment 2025 : దరఖాస్తు ఎలా చేయాలి?

  • ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంది అని నిర్ధారించుకున్నాక మీరు చేయాల్సింది నేను కింద ఇచ్చిన లింక్స్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
  • మీ చేతిరాతతో అప్లికేషన్ ఫారం ని తప్పులు లేకుండా ఫిల్ చేసి, మీ సర్టిఫికెట్లు అన్నీ కూడా జిరాక్స్ కాపీలు తీయాలి అలాగే దానిపైన సెల్ఫ్ అటెస్ట్ (మీ సంతకం) చేయాలి.
  • ఇవన్నీ మీ అప్లికేషన్ ఫారం కి జత చేసి అలాగే మీరు తీసిన డి.డి ని కూడా మర్చిపోకుండా జత చేయాలి.
  • ఒక ఖాళీ ఎన్వలప్ తీసుకొని దానిపైన 30 రూపాయలు విలువ చేసే స్టాంపు అతికించాలి & నీ సొంత చిరునామాను దానిపైన రాయాలి.
  • ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక సెట్ గా చేసుకొని, ఒక పెద్ద ఎన్వలప్ లో ఇవన్నీ పెట్టి దాన్ని సీల్ చేయాలి.
  • దానిపైన బోల్డ్ అక్షరాలతో ” Application for the post of______________” ఆ ఖాళీ లో మీరు అప్లై చేసే పోస్ట్ పేరు రాయాలి.
  • ఇవన్నీ కూడా మీరు డిసెంబర్ 26వ తేదీ లోపల.. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి.
  • మీరు పంపవలసిన చిరునామా : SAINIK SCHOOL KODAGU, VILLAGE & POST : KUDIGE, TALUK: KUSHALNAGAR, KODAGU DIST, KARNATAKA : 571 232.

Sainik School Recruitment 2025 : ముఖ్యమైన లింకులు

Leave a Comment