Nirudyoga Bruthi Scheme 2025 : ఏపీ లోని యువతకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేశ్; ప్రతి నెల ₹3000/- జమ
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేష్ శుభవార్త తెలియజేశారు. ఈ 2025 సంవత్సరంలో నిరుద్యోగ యువతకు నెలకు ₹3000/- చొప్పున Nirudyoga Bruthi అందజేస్తామని మచిలీపట్నంలో జరిగిన మీటింగులో తీపి కబురు చెప్పారు. ఈ Nirudyoga Bruthi Scheme 2025 ద్వారా వారికి ఆర్ధిక సహాయం అందించి…వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చాము..దానిని నెరవేర్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు.

Nirudyoga Bruthi Scheme గతంలో ఎలాంటి అర్హతలు ఉండేవి?
- అభ్యర్థి డిగ్రీ లేదా డిప్లొమా చదివుండాలి
- వయస్సు : 22 నుండి 35 ఏళ్లు
- తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి
- ఇంట్లో ఒక్కరికి మాత్రమే అని నిబంధన
గమనిక: Nirudyoga Bruthi Scheme 2025 కి సంబంధించి ఇంకా ఎలాంటి విధి విధానాలు రూపొందించలేదు..కానీ ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తారు.
Nirudyoga Bruthi Scheme యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి?
నిరుద్యోగ భృతి స్కీమ్ 2025 యొక్క ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ లోని డిగ్రీ చదివి ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ..ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న యువతకు ఆర్ధిక స్వావలంబన చేకూర్చడం. కనీసం వాళ్ళు ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా కుటుంబ సభ్యుల పైన ఆధారపడకుండా స్వంతంగా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు ఆత్మ గౌరవంతో బతకడమే లక్ష్యం. ఇది ఏపీలోని నిరుద్యోగ యువతకు చాలా ఉపయోగపడుతుంది.
ఇది చదవండి 👉 NVS Admission పొందాలంటే కొత్త రూల్స్ వచ్చాయి : 6వ తరగతి లో చేరాలంటే ఇది తప్పనిసరి
నారా లోకేష్ యొక్క హామీ
మంత్రి నారా లోకేష్ మచిలీపట్నం సభలో మాట్లాడుతూ, ఈ Nirudyoga Bruthi Scheme ను 2025 సంవత్సరంలో తప్పకుండా అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టంగా తెలియజేశారు. అలాగే వారి నైపుణ్యాలు మెరుగు పరచడానికి శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని.. అందువల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడంతో పాటు రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి కూడా మెరుగుపడుతుందని చెప్పారు.
ఇది చదవండి 👉 AP గ్రామ/వార్డు సచివాలయం మొదటి నోటిఫికేషన్ వచ్చేసింది: 10th మాత్రమే అర్హత
విద్యార్ధులకు సూచనలు
ఇప్పటికే కూటమి ప్రభుత్వం Thalliki Vanadanam Scheme అమలు చేసింది…లాగే ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం కూడా ప్రారంభించబోతోంది. కచ్చితంగా Nirudyoga Bruthi Scheme 2025 కూడా అమలు చేస్తారు..కాబట్టి మీకు సంబంధించిన డిగ్రీ, స్టడీ సర్టిఫికేట్,బ్యాంకు అకౌంట్ కి NPCI & eKYC అప్డేట్, ఇంకా అవసరమైన పత్రాలు అన్ని సిద్ధం చేసుకుని పెట్టుకోండి…ఇంకా సమయం ఉంది కాబట్టి..త్వరపడండి! All The Best 🤝