TS Pre Primary School Recruitment 2026 : 5568 ఆయా & ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో 5568 ఆయా మరియు ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాల భర్తీకి సంభవించిన ప్రభుత్వ గైడ్ లైన్స్ విడుదల చేసింది. 2026-2027 విద్యా సంవత్సరం నుండి TS Pre Primary School Recruitment 2026 ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటిని రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇది యువతకు ఒక మంచి అవకాశం…

పోస్టుల వివరాలు
- పోస్టు పేరు : ఆయా & ఇన్స్ట్రక్టర్
- మొత్తం పోస్టులు: 5568 (ప్రతి ప్రీ ప్రైమరీ స్కూల్ లో 1 ఆయా , 1 ఇన్స్ట్రక్టర్)
- ఉద్యోగ రకం : కాంట్రాక్టు ఆధారంగా
విద్యార్హతలు
- ఆయా : ఈ పోస్టుకు కనీసం ఏడవ తరగతి పాస్ అయితే చాలు.
- ఇన్స్ట్రక్టర్ : ఈ పోస్టుకు 10+2 అర్హత ఉంటే చాలు, కాని బాల్య విద్య లేదా ECCE ఉంటే ప్రాముఖ్యత ఇస్తారు.
Also Read 👉 ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చే బెస్ట్ జాబ్స్ ఇవి , నెలకు 50 వేల జీతం
వయస్సు
- కనీస వయస్సు : 18 ఏళ్ళు
- గరిష్ట వయస్సు: 44 ఏళ్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST అభ్యర్ధులకు వయసులో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఇంటర్ ఇంటర్ మార్కుల మెరిట్ బట్టి ఎంపిక చేస్తారు.
ప్రాధాన్యత క్రమం :
- అదే గ్రామం/ నివాసి అయి ఉండాలి.
- అదే గ్రామపంచాయతీ
- అదే మండలం
- అదే జిల్లా
ఎవరు అప్లై చేసుకోవచ్చు?
- 10+2 లేదా 7th పాసైన మహిళలు
- పిల్లలతో మమేకం అవ్వగల/ బాల్య విద్య పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు
- స్థానికంగా ఉండే వాళ్లకు ప్రాధాన్యత కాబట్టి గ్రామీణ ప్రాంతాల వాళ్లకు మంచి అవకాశం
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే విధానం ఇంకా క్లియర్ గా తెలుపబడలేదు.. కేవలం గైడ్లైన్స్ మాత్రమే విడుదలయ్యాయి. పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది.. అప్పుడు మాత్రమే అప్లికేషన్ చేసే అవకాశం.