IIML Recruitment 2026 : నిరుద్యోగులకు సువర్ణ అవకాశం అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ
ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా & అనుభవం కూడా అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. IIML అంటే (Indian Institute of management, Lucknow) ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇందులో చాలా రకాల ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి.. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఈ IIML Recruitment 2026 ఆర్టికల్ లో కేవలం ప్రోగ్రాం అసిస్టెంట్ ఉద్యోగాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.. పూర్తిగా చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.
IIML Recruitment 2026
IIML ప్రోగ్రాం అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం ఎన్ని?
| పోస్ట్ కోడ్ | ఉద్యోగ విభాగం | మొత్తం ఖాళీల సంఖ్య |
| LC 20 | Programme Assistant (Post Graduate Programmes- PGP) |
02 Posts (UR-1, OBC-1) |
| LC 22 | Programme Assistant (Corporate Relations) |
01 Post (UR) |
| LC 23 | Programme Assistant (Human Resources-HR) |
01 Post (UR) |
| LC 26 | Programme Assistant (Admissions) |
02 Posts (UR- 1, SC-1) |
| LC 27 | Programme Assistant (Estate Management) |
01 Post (UR) |
| LC 28 | Programme Assistant (Sanitation Services) |
01 Post (SC) |
| LC 29 | Programme Assistant (Transport & Security) |
01 Post (OBC) |
| LC 32 | Programme Assistant (Centre for Food & Agribusiness Management- CFAM) |
01 Post (UR) |
| LC 33 | Programme Assistant (Dean-Infrastructure Office) |
01 Post (UR) |
| LC 34 | Programme Assistant (Corporate Communications & Media Relations-CCMR) |
01 Post (UR) |
IIML Vacancy Details 2026
జీతం & అర్హతలు
ఈ ఉద్యోగం గానీ వస్తే మనకు.. లైఫ్ సెట్ అయిపోతుంది, ఇది కాంట్రాక్ట్ బేసిక్స్ అయినా జీతం భారీగా ఉంటుంది.
✅ప్రోగ్రాం అసిస్టెంట్ ఉద్యోగాల జీతం : ₹ 50,000/- + HRA fixed ₹ 5840/- Total = ₹ 55,840/-
✅Age Limit: 35 years (ఎస్సీ ,ఎస్టీలకు వయసులో సడలింపులు వర్తిస్తాయి)
✅ విద్యార్హత : ఏదైనా విభాగంలో డిగ్రీ 60% మార్కులతో పాస్ అయితే చాలు.
Also Apply : కేంద్ర ప్రభుత్వ MTS ఉద్యోగాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల : ఇక్కడ క్లిక్ చేసి అప్లికేషన్ పెట్టండి
ఎలా సెలెక్షన్ చేస్తారు?
IIML Recruitment 2026 నోటిఫికేషన్ లో మనకు పేర్కొంది ఏంటంటే.. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసి, అర్హులైన వాళ్లకు ఈ మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ తేదీలను తెలుపుతారు. ఒకవేళ అనుకున్న దాని కంటే అప్లికేషన్స్ ఎక్కువగా వస్తే రాత పరీక్ష పెట్టే అవకాశం ఉంది.
ఎలా అప్లై చేయాలి?
ఈ ఉద్యోగాలకు మనం ఆఫ్లైన్ ఇంకా ఆన్లైన్ ఈ రెండు పద్ధతుల్లో కాదు.. ఒక google ఫారం లింక్ ద్వారా మనం అప్లికేషన్ పెట్టాలి.
✅చివరి తేదీ : 19/01/2026