SIR లో మీ ఓటు ఎక్కిందో..లేదో ఇపుడే చెక్ చేసుకోండి?SIR Form Submission Status in Voter List 2026

Telegram Channel Join Now

SIR లో మీ ఓటు ఎక్కిందో..లేదో ఇపుడే చెక్ చేసుకోండి?SIR Form Submission Status in Voter List 2026

SIR

ప్రజలందరికీ ముఖ్య గమనిక! SIR ఎమ్యునరేషన్ ఫారం లు సమర్పించడానికి ఈరోజే (14/07/2026) ఆఖరి రోజు, ఇంకా ఎవరైనా ఫారం లు BLO లకు ఇవ్వకపోతే ఈరోజు ఎట్టిపరిస్థితుల్లో సమర్పించండి. ఇకపోతే ఇంతకముందే BLO లకు ఫారం లు ఇచ్చిన వాళ్ళు మీ ఎమ్యునరేషన్ ఫారం లు విజయవంతంగా నమోదు అయ్యాయో..లేదో మీ మొబైల్ నుండే తెలుసుకోవడానికి భారత ఎన్నికల సంఘం (ECI) ఒక డైరెక్ట్ లింకును అందుబాటులోకి తీసుకువచ్చింది.

Join Our Whatsapp Channel 

ఈ SIR (Special Intensive Revision) ఎందుకు ప్రత్యేకం?

ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రక్రియ జరుగుతుంది…కానీ ఈసారి కరోనా రావడం వల్ల, 2019 లో జరగాల్సిన SIR ప్రక్రియ ఇప్పుడు చేస్తున్నారు, ప్రజలు భయపడాల్సింది ఏమి లేదు. మనకు త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా వాటిని దృష్టిలో పెట్టుకుని మొత్తం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తున్నారు. అంటే..గతంలో ఉండి..ఇపుడు చనిపోయిన వారు, చిరునామా మార్చుకున్న వారు, కొత్తగా ఓటు హక్కు కోసం వారు..ఈ SIR ద్వారా సవరించుకోవచ్చు, అయితే ఈ ప్రక్రియ లో మీ వివరాలు డిజిటలైజేషన్ అయ్యాయో..లేదో తెలుసుకోక పోతే మీ ఓటు తొలగించబడే అవకాశం ఉంది, కాబట్టి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

Also Read 👉 3800 కొత్త రేషన్ షాప్ డీలర్ల నోటిఫికేషన్ విడుదల, అప్లై చేయండి 

SIR Form Submission అయ్యిందో.. లేదో ఇలా చెక్ చేసుకోండి 👇👇

ఓటరు జాబితా సవరణలో భాగంగా మీరు BLO కి ఇచ్చిన SIR Form ఆన్లైన్ లో అప్లోడ్ అయ్యిందో..లేదో తెలుసుకోవడానికి కింద చెప్పిన(Online Verification Process) విధంగా ఫాలో అవ్వండి :

SIR Form Status checking Step by Step Guide

  • మొదట మీ మొబైల్ లేదా సిస్టమ్ లో గూగుల్ లోకి వెళ్లి ECINET వారి సిటిజన్ సర్వీస్ పోర్టల్ లింకును ఓపెన్ చేయండి.
  • అందులో మీ మొబైల్ నెంబర్ (లింక్ అయినది మాత్రమే) మరియు స్క్రీన్ పైన కనిపించే CAPTCHA CODE ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  • ఇప్పుడు మీ మొబైల్ కు వచ్చే OTP ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  • హోమ్ పేజీలో కనిపించే “Fill Enumeration Form” పైన క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ రాష్ట్రం పేరు అలాగే మీ ఓటరు కార్డు నెంబర్ ను నమోదు చేసి సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి.
  • ఇక్కడ ” Your Form Has Already Been Submitted” అని వస్తే..మీ SIR Form ఆన్లైన్ చేయబడింది అని అర్థం.అలాకాకుండా మీ వివరాలతో పాటు మీ ప్రాంత BLO (Booth Level Officer) పేరు కనిపిస్తే, మీ ఫారం ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది అని అర్థం. వెంటనే మీ BLO ను సంప్రదించి ఆన్లైన్ చేయించండి.

SIR స్టేటస్ చెక్ చేసుకునే ముఖ్యమైన లింకులు 

ఓటర్ల సౌకర్యం కోసం మీ ఫారం సబ్మిట్ అయినది లేనిది తెలుసుకోవడానికి, ఓటరు జాబితా డౌన్లోడ్ చేయడానికి, పాత మరియు కొత్త లిస్టులో పేర్లు వెతుక్కోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్ట్ లింకులను ఇచ్చింది…దీని వల్ల మీ ఇంటి నుండే SIR ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

SIR Form Status Check Link 2026

Search Name in 2002 Voter list

Search Name in 2026 Voter list

Leave a Comment