Thalliki Vandanam Scheme 2026 : తల్లికి వందనం చెల్లింపులపై కొత్త అప్డేట్..జూన్ 30 తరవాత చేరిన వారికి శుభవార్త!

Telegram Channel Join Now

Thalliki Vandanam Scheme బిగ్ అప్డేట్: జూన్ 30 తర్వాత బడులలో చేరిన వారికి చెల్లింపులపై క్లారిటీ!

తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకుల ఖాతాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని జమ చేస్తుంది. అయితే జూన్ 30 తర్వాత పాఠశాలల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థుల తల్లుల్లో చాలామందికి ” మా ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి?” మన సందేహం ఉంది.. దీనిపై ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది.

Thalliki Vandanam Scheme 2026

జూన్ 30 వరకు చేరిన విద్యార్థులకు ఇప్పటికే నగదు జమ

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్ 30 2026 లోపల పాఠశాలలలో చేరిన అర్హులైన విద్యార్థుల వివరాలను పరిశీలించి, వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో Thalliki Vandanam Scheme నగదు ఇప్పటికే జమ చేయబడింది.

అర్హతలు పూర్తి చేసిన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఒకసారి పరిశీలించుకోవచ్చు.

For More Updates Join Our Whatsapp Channel 

జూన్ 30 తర్వాత పాఠశాలలలో చేరిన వారికి డబ్బులు ఎప్పుడు వస్తాయి?

జూన్ 30 తర్వాత పాఠశాలలలో చేరిన విద్యార్థుల వివరాలు ప్రస్తుతం సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన తల్లుల ఖాతాలలో సుమారు ఒక నెల వ్యాధిలో పథకం నగదు జమ చేయనున్నట్ట సమాచారం.

అంటే, జూలై లేదా ఆ తర్వాత అడ్మిషన్ పొందిన విద్యార్థుల తల్లులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి వివరాల ధృవీకరణ పూర్తయిన వెంటనే చెల్లింపులు దశల వారీగా జరుగుతాయి.

Also Read 👉 SBI Platinum Scholarship 2026 : 15వేల నుండి 2లక్షల వరకు ఉచితంగా ఇస్తారు 😯

చెల్లింపులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు

జూన్ 30 తర్వాత చేరిన విద్యార్ధుల విషయంలో కొన్ని కారణాల వల్ల చెల్లింపులు ఆలస్యం కావచ్చు :

  1. విద్యార్థి అడ్మిషన్ వివరాల పరిశీలన
  2. ఆధార్ మరియు బ్యాంకు ఖాతా దృవీకరణ
  3. విద్యార్థి వివరాలు ప్రభుత్వ పోర్టల్ లో అప్డేట్ కావడం
  4. అర్హత నిర్ధారణ పూర్తి కావడం

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే నగదు విడుదల చేయబడుతుంది.

తల్లులు ఏమి చేయాలి?

  1. తల్లికి వందనం పథకం నగదు కోసం ఎదురుచూస్తున్న వారు ఈ విషయాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి:
  2. విద్యార్ది వివరాలు పాఠశాలలో సరిగా నోమోదు అయ్యాయో..లేదో సరి చూసుకోవాలి.
  3. ఆధార్ నంబర్ మరియు బ్యాంకు ఖాతా వివరాలు సరైనవేనా అని నిర్ధారించుకోవాలి.
  4. బ్యాంకు ఖాతా యాక్టివ్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
  5. అవసరమైతే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను లేదా విద్యాశాఖ అధికారులు సంప్రదించాలి.

Leave a Comment