CAU Recruitment 2026 : వ్యవసాయ యూనివర్సిటీ నుండి పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు వ్యవసాయ యూనివర్సిటీ నుండి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. CAU (Central Agricultural University), ఇది ఒక కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ కాబట్టి ఇందులో ఉద్యోగాలు సంపాదిస్తే మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులము అవుతాము. ఈ CAU Recruitment 2026 ద్వారా 10th, ఇంటర్ & డిగ్రీ అర్హతల వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. మీరు గాని ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు సువర్ణ అవకాశం, ఈ ఆర్టికల్ తెలుగులోనే రాయడం జరిగింది పూర్తిగా చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

CAU Recruitment ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు
చూడండి! ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు.. కానీ నేను ఈ ఆర్టికల్లో మీరు అప్లై చేసుకోదగ్గవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం అర్హతతోనే అప్లికేషన్ చేసుకోదగినవి. మిగతా వాటిని కూడా చూడాలి అంటే అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
- స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్
- కంప్యూటర్ ఆపరేటర్
- పర్సనల్ అసిస్టెంట్
- అప్పర్ డివిజన్ క్లర్క్
- లోయర్ డివిజన్ క్లర్క్
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్
- కాంపౌండర్ డ్రెస్సర్
పైన చెప్పిన ఉద్యోగాలకు మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి ఎందుకంటే వీటికి ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం అర్హతతోనే అప్లికేషన్ చేయొచ్చు.
విద్యార్హతలు
స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ :
- ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ 60% మార్కులతో పాసై ఉండాలి.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో పాసైన పర్వాలేదు.
కంప్యూటర్ ఆపరేటర్ :
- కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయితే చాలు.
పర్సనల్ అసిస్టెంట్ :
- ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉండాలి.
- షార్ట్ హ్యాండ్ విభాగంలో 100W.P.M (ఇంగ్లీష్) స్పీడ్ మరియు టైపింగ్ 30 W.P.M (ఇంగ్లీష్) స్పీడ్ కలిగి ఉండాలి.
అప్పర్ డివిజన్ క్లర్క్ :
- కేవలం డిగ్రీ పాస్ అయితే చాలు.
లోయర్ డివిజన్ క్లర్క్ :
- ఇంటర్ అర్హత
- కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి
- ఇంగ్లీష్ విభాగంలో టైపింగ్ స్పీడ్ 30W.P.M
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ :
- 10th పాసైతే చాలు
కాంపౌండర్ డ్రెస్సర్:
- ఫార్మసి విభాగం లో డిగ్రీ పాస్ అయితే చాలు
Also Read 👉 గ్రామీణ వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది : అప్లై చేసుకోండి
ఎన్ని పోస్టులు, వయస్సు ఎంత? & జీతం వివరాలు
| పోస్టు | వయస్సు | జీతం వివరాలు |
| స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ | 18 నుండి 35 | అన్ని అలవెన్సులు కలుపుకొని ₹80,000/- |
| కంప్యూటర్ ఆపరేటర్ | 18 నుండి 30 | ₹55,000/- |
| పర్సనల్ అసిస్టెంట్ | 18 నుండి 30 | ₹55,000/- |
| అప్పర్ డివిజన్ క్లర్క్ | 18 నుండి 30 | ₹45,000/- |
| లోయర్ డివిజన్ క్లర్క్ | 18 నుండి 27 | ₹39,000/- |
| మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 18 నుండి 25 | ₹35,000/- |
| కాంపౌండర్ డ్రెస్సర్ | 18 నుండి 25 | ₹45,000/- |
CAU Recruitment Age & Salary Details
ఫీజు ఎంత?

- UR, OBC & EWS వాళ్లకు: ₹500/-
- మిగతా అందరికీ & ఆడవాళ్లకు కూడా : ఎటువంటి ఫీజు లేదు
సెలక్షన్ ప్రాసెస్
CAU Recruitment 2026 నోటిఫికేషన్ లో సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన పాట్రన్ అయితే ఇవ్వలేదు కానీ.. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని మాత్రం చెప్పారు.
కాబట్టి ఈ ఉద్యోగాలకు బాగా ప్రిపేర్ అవ్వండి మీరు ఏవైతే టాపిక్స్ చదువుతూ ఉన్నారో వాటిపైనే ఎగ్జామ్ పెడతారు.
దరఖాస్తు ప్రక్రియ
ఈ ఉద్యోగాలకు మొదట ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకొని ఆఫ్లైన్ విధానంలో అంటే ( చేతి ద్వారా గాని, రిజిస్టర్ పోస్టు ద్వారా గాని, స్పీడ్ పోస్ట్ ద్వారా గాని) కింద వివరంగా ఇవ్వడం జరిగింది చూడండి 👇 👇
- దరఖాస్తు ప్రారంభం : 10/01/2026
- దరఖాస్తు ముగింపు : 15/02/2026
- ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సిన చివరి తేదీ : 22/02/2026
ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సిన చిరునామా :
The Registrar,
Central Agricultural University, Imphal,
Manipur – 795004.