ICAR – CRIDA Recruitment 2026 : సొంత రాష్ట్రంలోని వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు
చాలామందికి ఎక్కడికో వెళ్లి జాబ్ చేయడం అంటే ఇష్టం ఉండదు.. సొంత రాష్ట్రంలోని జాబ్ వస్తే బాగుటుంది అని ఎదురుచూస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ల కోసమే కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అది కూడా మన హైదరాబాదులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ICAR – CRIDA ( Central Research Institute for Dryland Agriculture) ఈ సంస్థ మన హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇక్కడ పని చేయడానికి టెంపరరీ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు మరియు ఇతర ఉద్యోగాలు భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ వచ్చింది. ICAR – CRIDA Recruitment 2026 ఆర్టికల్ ద్వారా తెలుగులో పూర్తి వివరాలు రాయడం జరిగింది.. జాబ్ నీడ్ ఉన్నవాళ్లు తప్పకుండా అప్లికేషన్ చేయండి.

విడుదలైన ఉద్యోగాల సంఖ్య
ICAR-CRIDA Recruitment 2026 ద్వారా రీసెర్చ్ అసోసియేట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- రీసెర్చ్ అసోసియేట్ – 02
- కంప్యూటర్ ఆపరేటర్ – 01
వయస్సు & విద్యార్హతలు
| పోస్టు | వయస్సు | విద్యార్హత |
| రీసెర్చ్ అసోసియేట్ | మగవాళ్ళకు – 18 నుండి 40
ఆడవాళ్లకు – 18 నుండి 45 |
RA 1 : Phd in Agronomy/ Soil Science లేదా మాస్టర్ డిగ్రీ
RA 2 : Phd in Computer Science లేదా మాస్టర్ డిగ్రీ |
| కంప్యూటర్ ఆపరేటర్ | 21 నుండి 27 | డిగ్రీ పాసైతే చాలు |
ICAR – CRIDA Recruitment Age & Qualification
Also Read 👉 10th పాస్ అయితే వ్యవసాయ శాఖలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ: అప్లై చేయండి
ముఖ్యమైన వివరాలు
- ఈ ఉద్యోగాలు పర్మనెంట్ కాదు టెంపరరీ గా భర్తీ చేస్తున్నారు.
- ఈ ఉద్యోగాలు వస్తే పోస్టింగ్ మనకు హైదరాబాద్లో ఉంటుంది.
- ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు మరియు ఫీజు కూడా లేదు.
- డైరెక్ట్ గా మనం వాకింగ్ ఇంటర్వ్యూ కి వెళ్లి అటెండ్ అవ్వాలి.
- ఇంటర్వ్యూ తేదీ : 19/01/2026
- ఇంటర్వ్యూ స్థలం : ICAR-CRIDA, Santosh Nagar, Saidabad P.O, Hyderabad -500059.
చేరగానే జీతం ఎంత?
| పోస్టు | జీతం |
| రీసెర్చ్ అసోసియేట్ ( BUR ప్రాజెక్టు) | Phd వాళ్లకు: ₹67,000/- + 30% HRA
మాస్టర్ డిగ్రీ వాళ్లకు : ₹61,000/- + 30% HRA |
| రీసెర్చ్ అసోసియేట్ ( CROPSAP ప్రాజెక్టు) | Phd వాళ్లకు: ₹54,000/- + 30% HRA
మాస్టర్ డిగ్రీ వాళ్లకు : ₹49,000/- + 30% HRA |
| కంప్యూటర్ ఆపరేటర్ | ₹26,000/- |
ICAR-CRIDA Salary Details
Also Read 👉 ఒక్క రాత పరీక్ష కూడా లేకుండా గవర్నమెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు, జాబ్ వస్తే ₹55,840/- జీతం
ICAR-CRIDA Recruitment 2026 లో విడుదలైన ఉద్యోగాలకు అప్లై చేసే విధానం
- ఈ ఉద్యోగాలకు Offline లో డైరెక్ట్ ప్రదేశానికి వెళ్లి ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి.
- వెళ్లేటప్పుడు పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం తో పాటు, మీ విద్యార్హత సర్టిఫికెట్లు నకలు కాపీలు & ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళాలి.
- అదేరోజు ఇంటర్వ్యూ చేసి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది.