TG రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్: ఆగస్టు, సెప్టెంబర్ & అక్టోబర్ నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ!

Telegram Channel Join Now

TG రేషన్ కార్డు ధరలకు గుడ్ న్యూస్: August, September & October మూడు నెలల రేషన్ పంపిణీ ఒకేసారి.

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న లక్షలాది కుటుంబాలకు మరోసారి మంచి వార్త వచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్ & అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీనితో రేషన్ కార్డు ధరలు మూడు నెలల కోట బియ్యాన్ని ఒకేసారి తీసుకోవచ్చు.

రేషన్ కార్డు

హైకోర్టు తీర్పు తర్వాత సరఫరా సాఫీగా

ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ పై రేషన్ డీలర్లు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తెలంగాణ హైకోర్టు ఆఫ్ పిటీషన్ ను తోసి పుచ్చింది. దీంతో పౌరసరఫరాల శాఖకు సరఫరా చేయడానికి మార్గం సుగమమైంది.

For More Updates Join Our Whatsapp Channel 

64.80 లక్షల క్వింటాళ్ల బియ్యం విడుదల

పౌరసరఫరాల శాఖ 64.80 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని విడుదల చేసింది. గోదాముల నుండి వెంటనే రేషన్ షాపులకు ఈ బియ్యాన్ని చేర్చాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనితో ఆగస్టు 1 నుండి 15 వరకు రేషన్ పంపిణీ కొనసాగే అవకాశం ఉంది.

Also Read 👉 Thalliki Vandanam Scheme 2026 : తల్లికి వందనం చెల్లింపులపై కొత్త అప్డేట్..జూన్ 30 తరవాత చేరిన వారికి శుభవార్త!

రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక

  1. మీ రేషన్ కార్డు సక్రమంగా ఉందో లేదో చెక్ చేసుకోండి.
  2. eKYC పూర్తి చేసి ఉండాలి (చాలా చోట్ల అడుగుతున్నారు).
  3. మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ కు వెళ్లి బయోమెట్రిక్ వేసి బియ్యం తీసుకోవచ్చు.
  4. ఒకేసారి మూడు నెలల కోట వస్తుంది కాబట్టి ఇంట్లో స్టోరేజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
  5. మీకు ఏదైనా సమస్య ఉంటే స్థానిక పౌరసరఫరాల శాఖ అధికారిని లేదా హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించండి.

Leave a Comment