Telangana Family Register Certificate : ప్రతి కుటుంబానికి ఒక కొత్త అధికారిక పత్రం!

Telegram Channel Join Now

Telangana Family Register Certificate : ప్రతి కుటుంబానికి ఒక కొత్త అధికారిక పత్రం!

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించింది.ఈ విషయం పై ఇటీవల G.O కూడా జారీ చేసింది. ప్రతి కుటుంబానికి ఇది ఒక ఉపయోగపడే అధికారక డాక్యుమెంట్.

Family Register Certificate

Family Register Certificate అంటే ఏమిటి?

ఇది కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కుటుంబ అధికారిక పత్రం, ఇందులో :

  • ఫ్యామిలీ రిజిస్టర్ ID నెంబర్ (రేషన్ కార్డు నెంబర్ తరహాలో) ఉంటుంది.
  • ఫ్యామిలీ హెడ్ యొక్క వివరాలు.
  • కుటుంబంలో ఉన్న వారందరి పేర్లు.
  • అందరి ఆధార్ నెంబర్లు & ఫోటోలు ఉంటాయి.

For More Updates Join Our Whatsapp Channel 

ఎందుకు అవసరం?

ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలు సెపరేట్ గా ఇవ్వాల్సి వచ్చేది.. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ జారీ చేయడం వల్ల కుటుంబ వివరాలు అన్ని సర్టిఫికెట్ లో ఉండడం ఉంటాయి. ఈ ఒక్క సర్టిఫికెట్ ఇస్తే చాలు సెట్ అవుతుంది.

Also Read 👉 TG రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్: ఆగస్టు, సెప్టెంబర్ & అక్టోబర్ నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ!

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

తెలంగాణ ప్రభుత్వం ఈ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలని సూచించింది:

మీసేవ పోర్టల్ (ts.meeseva.telangana.gov.in)

పైన పేర్కొన్న వెబ్సైట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల వివరాలు వెరిఫికేషన్ అయిన తర్వాత తహసిల్దార్ డిజిటల్ సంతకంతో ఒక రెండు రోజుల్లో ఈ సర్టిఫికెట్ మనకు వస్తుంది.

Leave a Comment